హైద్రాబాద్ చైతన్యపురి వాసవీకాలనీలో అతి వేగంగా వచ్చిన కారు టీ దుకాణంలోకి దూసుకెళ్లింది.దీంతో షాపులో ఫర్నీచర్ ధ్వంసమైంది.
హైదరాబాద్: హైద్రాబాద్ చైతన్యపురి వాసవీకాలనీలో అతి వేగంగా వచ్చిన కారు టీ దుకాణంలోకి దూసుకెళ్లింది.దీంతో షాపులో ఫర్నీచర్ ధ్వంసమైంది.అతి వేగంగా దూసుకు వచ్చిన కారు టీ షాపులోకి దూసుకెళ్లింది. దీంతో ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
కారును అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కారు అతివేగంగా వస్తున్న సమయంలో గమనించిన టీ స్టాల్ యజమాని గుర్తించి వెంటనే పక్కకు తప్పుకొన్నాడు.దీంతో ఆయన ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు.
కారుకు బ్రేకులు ఫెయిలయ్యాయా.. లేదా డ్రైవర్ అజాగ్రత్తగా నడిపాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన సీసీటీవీ పుటేజీలో రికార్డయ్యాయి.
