కొడుకుతో కలిసి తండ్రి ఆత్మహత్య, ఏడో తరగతిలో మార్కులు తక్కువగా వచ్చాయని...

Man pushes son into lake, kills self at hyderabad
Highlights

మొదట కొడుకును చెరువులో తోసి...ఆ తర్వాత తాను దూకి....

కొడుకు సరిగ్గా చదవడం లేదని, మంచి మార్కులు సంపాధించడం లేదని కలత చెందిన తండ్రి ఆ కొడుకుతో కలిసి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మొదట కొడుకును చెరువులో తోసేసిన తండ్రి ఆ తర్వాత తాను కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. జనగామ జిల్లా కుందారం గ్రామానికి చెందిన శ్రీధర్ తన భార్య రజని పిల్లలు తేజ,కార్తిక్ లతో కలిసి హైదరాబాద్ జవహార్ నగర్ లో నివాసముంటున్నాడు. ఇతడు అక్కడే ఓ మెడికల్ షాప్ ను నిర్వహిస్తున్నాడు.

అయితే అతడి కుమారుడు ఇటీవలే ఏడో తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ అందులో తక్కువ మార్కులు రావడం శ్రీధర్ అవమానంగా బావించాడు. దీంతో తీవ్రంగా బాధపడుతూ డిప్రెషన్ లో ఉన్న శ్రీధర్ ని ఓ విషయంలో తప్పుగా వ్యవహరించావంటూ తండ్రి మందలించాడు. 

దీంతో మరింత బాధలోకి వెళ్లిన శ్రీధర్ దారుణ నిన్ణయం తీసుకున్నాడు. తన కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తేజను తీసుకుని బయటకి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పిన శ్రీధర్ నేరుగా ఓ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. మొదట కుమారుడిని చెరువులో తోసేసి తానూ దూకాడు. దీంతొో ఇద్దరూ నీటిలో మునిగి చనిపోయారు.
 
చెరువలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో మృతదేమాలను బైటికి తీయించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే ఆ ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

loader