ప్రేమకు నో అంటే చాలు అమ్మాయిల్ని రకరకాలుగా వేధిస్తున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి ఓ అమానుష ఘటన హైదరాబాద్ లో జరిగింది. బాధితురాలి కంప్లైంట్ తో విషయం వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెడితే.. నగర శివారుల్లోని ఓ కాలేజీలో చదువుతున్న యువతికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఫోన్ చేసిన వాళ్లు అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించసాగారు. దీంతో ఆ అమ్మాయి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

వారి దర్యాప్తులో ఆ యువతి నెంబర్ ‘కాల్ గర్ల్’ గా ఆమె స్నేహితుడే ప్రచారం చేసినట్లు తేల్చారు. 
కింగ్ కోఠికి చెందిన మమ్మద్ సమీర్ (25)తో, బాధితురాలికి మూడు నెలల కిందట కాలేజీలో పరిచయమయ్యింది. కొన్నాళ్లకు సమీర్ తను ఆమెను ప్రేమిస్తున్నట్టుగా తెలిపాడు. అయితే ఆమె మాత్రం ప్రేమ తనకు ఇష్టంలేదని తిరస్కరించింది. 

దీంతో యువతిపై  మహ్మద్ కోపం పెంచుకున్నాడు. డేటింగ్ వెబ్ సైట్ లో అసభ్యకరమైన ఫోటోలను అప్ లోడ్ చేశాడు. ఆ ఫొటోల కింద బాధితురాలి ఫోన్ నంబర్, వివరాలు ఇచ్చాడు. నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.