అత్తపై యాసిడ్ దాడి చేయించిన అల్లుడు

Man plots acid attack on wife, mother-in-law falls victim
Highlights

భార్యపై యాసిడ్ దాడికి ప్లాన్...చివరకు అత్తపై...

తనను కాదని విడాకులు కోరిన మహిళపై ఆ భర్త పగ పెంచుకున్నాడు. దీంతో ఆమెపై యాసిడ్ దాడి చేయాలని బావించాడు. దీనికోసం ఇద్దరు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చాడు. అయితే అతడి భ్యారపై దాడి చేయాల్సిన ఆ దుండగులు అతడి అత్తపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్  లోని కంచన్ బాగ్ లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖదీర్(27), సబా తబస్సుమ్ కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఖదీర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు.

అయితే ఇతడు మద్యానికి బానిసై రోజూ తాగి వచ్చి అకారణంగా భార్యతో గొడవపడుతూ శారీరకంగా హించించేవాడు.  అతడి బాధను భరించలేక తబస్సుమ్ పిల్లలను తీసుకుని కంచన్ బాగ్ లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. 

అంతే కాకుండా అతడికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని ఖదీర్ వ్యతిరేకించాడు. అంతే కాకుండా రంజాన్ పండక్కి ఇంటికి రావాలని భార్యను కోరాడు. అయినా ఆమె అతడి ఇంటికి వెళ్లలేదు. దీంతో అతడికి భార్యపై కోపం మరింత పెరిగిపోయింది.

ఈ క్రమంలో భార్యపై యాసిడ్ దాడికి ఖదీర్ పథకం వేశాడు. ఇందుకోసం వసీమ్, దస్తగిరి అనే ఇద్దరు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చాడు. తన భార్య పుట్టింటి అడ్రస్ ను వారికి చెప్పి దాడి చేయాలని కోరాడు.

ఈ క్రమంలో ఈ నెల 14 వ తేదీన దుండగులిద్దరు కంచన్ బాగ్ లోని తబస్సుమ్ పుట్టింటికి వెళ్లారు. ఇంటి తలుపులు మూసి ఉండటంతో తబస్సుమ్ ను పిలిచారు. అయితే ఆమెకె బదులు ఆమె తల్లి సాదియాబేగం తలుపులు తీసింది. దీంతో దుండగులు తమతో తెచ్చుకున్న యాసిడ్ ను ఆమె ముఖంపై పోసి పరారయ్యారు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పథకం వేసిన ఖదీర్ తో పాటు మిగతా ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

loader