Asianet News TeluguAsianet News Telugu

భార్యను చచ్చేట్టు కొట్టి, గొంతుకు ఉరివేసి... గుండెపోటు అని నమ్మించాలని చూసి...

శ్రీనివాస్ సురాంభను పథకం ప్రకారమే murder చేసినట్లు అర్థమవుతుంది.  ఇంట్లో ఇద్దరు పిల్లలు పడుకున్న తర్వాత అనుమానం రాకుండా చంపాడు.  అదే రాత్రి deadbodyని తన టాటా ఏసీ ఆటో లో వేసుకుని ఊరికి బయలుదేరాడు.  ఆ సమయంలో అర్ధరాత్రి దాటాక పిల్లలకు మెలుకువ వచ్చి ఫోన్ చేస్తే కూరగాయల కోసం వెళ్తున్నట్లు చెప్పి నమ్మించాడు.

man murdered wife over family dispute and create heart attack, arrest in suryapet
Author
Hyderabad, First Published Oct 7, 2021, 7:49 AM IST

హైదరాబాద్ : కట్టుకున్న భార్యను ప్రాణం పోయే దాకా కొట్టాడు ఇంకా ఊపిరి ఉందనే అనుమానంతో తాడుతో గొంతుకు ఉరి వేశాడు. మృతదేహాన్ని  బూడిద చేయాలనుకున్నాడు. కానీ వీలు కాలేదు. గుండె పోటుతో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేసి చివరకు అడ్డంగా దొరికిపోయాడు ఓ భర్త.

ఈ ఘటన ఉప్పల్ పరిధిలో గత నెల 29న జరిగింది. ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాలకు  చెందిన చిత్తలూరు శ్రీనివాస్, సురాంబ (35) దంపతులు 18 ఏళ్ల క్రితం రామంతాపూర్ కు వచ్చారు.  శ్రీనగర్ కాలనీలో ఉంటూ ఆయన డ్రైవర్ గా పని చేసేవాడు.

మూడేళ్లుగా భార్యాభర్తలిద్దరూ కలిసి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి  ఇంటర్ చదువుతున్న కూతురు,  తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ కొంతకాలంగా ఇంట్లో సక్రమంగా పనిచేయకపోగా ఇతరుల వద్ద డబ్బులు అప్పు చేస్తూ తన పరిస్థితులకు ఇస్తున్నాడు. దీంతో అప్పు ఇచ్చిన వారు ఇంటికొచ్చి ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. 

శ్రీనివాస్ సురాంభను పథకం ప్రకారమే murder చేసినట్లు అర్థమవుతుంది.  ఇంట్లో ఇద్దరు పిల్లలు పడుకున్న తర్వాత అనుమానం రాకుండా చంపాడు.  అదే రాత్రి deadbodyని తన టాటా ఏసీ ఆటో లో వేసుకుని ఊరికి బయలుదేరాడు.  ఆ సమయంలో అర్ధరాత్రి దాటాక పిల్లలకు మెలుకువ వచ్చి ఫోన్ చేస్తే కూరగాయల కోసం వెళ్తున్నట్లు చెప్పి నమ్మించాడు.

వలపు వల విసిరి.. బావతో కలిసి యువతి రూ.1.20కోట్లకు టోకరా.. !

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహం పైన,  చుట్టూ కూరగాయల ఖాళీ డబ్బులు పెట్టాడు. రామంతపూర్ నుంచి బయలుదేరి వెళ్లే మార్గంలో 12 పోలీస్ స్టేషన్లను దాటుకుని  చేరుకున్నాడు. పణిగిరి గుట్టల్లోనే మృతదేహాన్ని కాల్చివేద్దాం అనుకుంటే అప్పటికి తెల్లారడంతో ఈ పథకం బెడిసికొట్టింది. తప్పని పరిస్థితుల్లో పస్తాల గ్రామానికి చేరుకుని heart attackతో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేశాడు.

మృతదేహం పడి ఉన్న గాయాలను గుర్తించిన బంధుమిత్రులు నాగారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు కథ వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న  పోలీసులు  ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు. తదుపరి విచారణ ఇక్కడి పోలీసులు కొనసాగిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios