అమల శాంతి, రాహుల్ లు వరుసకు బావ మరదలు కావడంతో కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు తర్వాత ఇద్దరి మధ్య గొడవలయి, పెద్దలకు కూడా తెలియడంతో మందలించారు. ఇద్దరు వేరుగా ఉంటున్నారు.
హైదరాబాద్ : తాను ప్రేమించిన అమ్మాయే తన పెళ్లిని చెడగొట్టిందనే అక్కసుతో యువతిని చంపేందుకు ప్రయత్నించాడో యువకుడు. దీంతో కటకటాల పాలైన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దేవరకొండ గ్రామానికి చెందిన రమేష్, సంధ్యలు భార్యాభర్తలు. వీరిద్దరూ ఆయిల్ సీడ్ కాలనీలోని క్వార్టర్స్లో కొంతకాలంగా నివాసముంటున్నారు. వీరితోపాటు రమేష్ చెల్లెలు అమల శాంతి వారి వద్దే ఉంటూ చదువుకుంటుంది. కొంతకాలం క్రితం సంధ్య తమ్ముడు రాహుల్ కూడా వీరితోనే ఉండేవాడు.
అమల శాంతి, రాహుల్ లు వరుసకు బావ మరదలు కావడంతో కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు తర్వాత ఇద్దరి మధ్య గొడవలయి, పెద్దలకు కూడా తెలియడంతో మందలించారు. ఇద్దరు వేరుగా ఉంటున్నారు.
ఇదే సమయంలో రమేష్, సంధ్యల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లో 498 ఏ సెక్షన్ కింద కేసు కూడా ఉంది. సంధ్య తన పుట్టింటి వద్దనే ఉంటుంది. రమేష్, అమలశాంతిలతో పాటు మరో బంధువైన చెన్నకేశవులు ఉంటున్నారు.
ఇటీవల రాహూల్ కు పెళ్లి సంబంధం కుదిరింది. అయితే బంధువుల విచారణలో అమలశాంతి లో జరిగిన ప్రేమాయణాన్ని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో పెళ్లికూతురు వాళ్ళ సంబంధాన్ని రద్దు చేశారు.
భార్య సాయంతో మహిళపై రేప్, హత్య: 11 హత్యలకు పాల్పడిన భార్యాభర్తలు
కవాలనే తన పెళ్లి చెడగొట్టిందన్న అక్కతో మంగళవారం ఉదయం సమయంలో ఇంట్లో ఎవరూ లేరనుకుని రాహుల్ అమల శాంతిని చంపేందుకు కుట్ర పన్నాడు. వెంట ఒక చున్నీ, చేతులకు గ్లౌజులు తెచ్చుకున్నాడు.
డోర్ లాక్ చేసిన తర్వాత బయటకు వచ్చిన అమలశాంతిని చున్నీతో మెడను గట్టిగా నులిమే ప్రయత్నం చేశాడు. అమల శాంతి బిగ్గరగా కేకలు వేయడంతో వచ్చాడు లోపల ఉన్న చెన్నకేశవులు వచ్చాడు. అంతే క్షణాల్లో రాహుల్ అక్కడి నుంచి పరారయ్యాడు. మంగళవారం యువతి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
