Asianet News TeluguAsianet News Telugu

భార్య సాయంతో మహిళపై రేప్, హత్య: 11 హత్యలకు పాల్పడిన భార్యాభర్తలు

వరుస హత్యలకు పాల్పడుతున్న భార్యాభర్తలను తెలంగాణలోని దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ హత్య కేసు విచారణలో ఆ భార్యాభర్తల బాగోతం వెలుగు చూసింది. 

Missing 35 year old labourer killed in Jinnaram of Telangana
Author
Sangareddy, First Published Jul 29, 2021, 9:04 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: హత్యలు, చోరీలకు పాల్పడుతున్న భార్యాభర్తల గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆదివారంనాడు అదృశ్యమైన మహిళా కూలీ శవమై తేలింది. మహిళపై దుండగుడు భార్య సాయంతో అత్యాచారం చేసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం కొండ ప్రాంతంలో చోటు చేసుకుంది. 

గొంతు నులిమి హత్య చేసిన తర్వాత భార్యాభర్తలు మహిళ బంగారు చెవిపోగులు, వెండి కాళ్ల కడియాలు తీసుకుని పారిపోయారు. భార్యాభర్తలు ఇటువంటి నేరాలు ఇది వరకు చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను స్వామి (35), నర్సమ్మలుగా గుర్తించారు. స్వామి, నర్సమ్మ దంపతులు వికారాబాద్ జిల్లాకు చెందినవారు. 

కూలీ పని కోసం మృతురాలు మల్లమ్మ ఆదివారం ఉదయం దుండిగల్ లోని తన ఇంటి నుంచి అడ్డాకు వెళ్లింది. అక్కడికి స్వామి, నర్సమ్మ దంపతులు టూవీలర్ మీద వచ్చారు జిన్నారంలోని మేడారం ప్రాంతంలోని చిన్న గుడికి పెయింటింగ్ వేసే పని ఉందని మహిళకు చెప్పారు. 

మేడారం చేరుకున్న తర్వాత మహిళను దంపతులు కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకున్న తర్వాత స్వామి భార్య నర్సమ్మ సాయంతో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని శవాన్ని పడేసి పారిపోయారు. 

మర్నాడు సోమవారం ఉదయం బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు మల్మంపేట వద్ద ఉన్న సిసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. తద్వారా పోలీసులు నిందితుడిని గుర్తించారు. బుధవారంనాడు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

విచారణలో స్వామి చెప్పిన విషయాల ఆధారంగా పోలీసులు జిన్నారంలోని మేడారం కొండ ప్రాంతాలకు వెళ్లి మృతురాలి శవాన్ని కనిపెట్టి స్వాధీనం చేసుకున్నారు. శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. కాగా, స్వామి, నర్మమ్మ దంపతులు ఇప్పటి వరకు 11 హత్యలు చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. కూలీ ఆశ చూపి హత్యలు చేస్తూ దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios