కన్న తండ్రితో సమానమైన పెదనాన్న... ఓ వివాహితపై లైంగిక వేధింపులకు దిగాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని నిడమనూరులో చోటుచేసుకుంది. సొంత తమ్ముడి కూతురిని.. కన్న కూతురులా  చూసుకోవాల్సింది పోయి... దారుణంగా వ్యవహరించాడు. లైంగికంగా వేధించాడు. ఈ ఘటన జరిగి చాలా రోజులు కాగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... 19ఏళ్ల వివాహిత, ఆమె పెదనాన్న 40 ఏళ్ల సింగంశెట్టి పెదనర్సయ్య వేర్వేరు గ్రామాల్లో ఉంటున్నారు. పెదనర్సయ్య సొంత తమ్ముడి కూతురైన వివాహితపై కన్నేశాడు. తరచూ ఆమె ఇంటికి వెళ్లి లైంగికంగా వేధిస్తున్నాడు. 

శనివారం కూడా వెళ్లిన పెదనర్సయ్య, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు బాధితురాలిపై దాడి కూడా చేశాడు. విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పగా.. ఇద్దరూ కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లి పెదనర్సయ్యపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.