ఇంటికి కోడలిగా అడుగుపెట్టిన యువతిని కన్న కూతురిలా చూడాల్సిన మామ దారుణంగా ప్రవర్తించాడు. కొడుకు పని మీద దుబాయి వెళ్లగా.. ఒంటరిగా ఉన్న కోడలిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా తాను దక్కించుకోవాలని ఆశపడ్డాడు. ఈ క్రమంలో కోడలిపై మామ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకోవడం గమనార్హం. 

 కాగా.. మామ వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన కోడలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితురాలు ఇవాళ డిశ్చార్జి అయ్యింది. 

మామ వేధింపుల గురించి బంధువులకు వెల్లడించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె బంధువులు వేధింపులకు గురిచేసిన మామకు దేహశుద్ధి చేశారు. అనంతరం దేవునిపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.