కోరిక తీర్చకుంటే.. యాసిడ్ పోస్తానంటూ.. ఓ వ్యక్తి వివాహితను వేధించాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో చోటుచేసుకుంది. కాగా.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి.. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఫిల్మ్ నగర్ లోని వినాయకనగర్ బస్తీకి చెందిన వివాహిత(28) టైలర్ గా పనిచేస్తూ.. జీవనం సాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన రాజు.. ఆమెపై కన్నువేశాడు. తన కోరిక తీర్చాలంటూ గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. దానికి ఆమె నిరాకరించడంతో బెదిరించడం మొదలుపెట్టాడు. తాను పిలిచినప్పుడు తన దగ్గరకు రావాలని.. ఫోన్ చేస్తే మాట్లాడాలని.. కోరిక తీర్చాలని.. వీటిలో ఏది వినకపోయినా యాసిడ్ పోస్తానని బెదిరించాడు. 

కేవలం ఆమె మీద మాత్రమే కాకుండా.. ఆమె కుటుంబసభ్యులందరి మీదా యాసిడ్ పోస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. కాగా.. అతని వేధింపులు తట్టుకోలేక.. సదరు మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.