ఇద్దరూ మంచి మిత్రులు. ఒకరింటికి మరొకరు వస్తూ వెళుతూ ఉండేవారు. తాజాగా స్నేహితులు ఇద్దరూ కలిసి మందు పార్టీచేసుకున్నారు.ఆ క్రమంలో.. స్నేహితుడి భార్యపట్ల మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడు. అలా చేయడం తప్పు అని మందలించినందుకు స్నేహితుడిని చంపేసి పరారయ్యాడు. ఈ సంఘటన అమీర్ పేటలో చోటుచేసుకుంది.

Also Read మెడలో తాళి ఉరితాడుగా బిగిసుకొని......

పూర్తి వివరాల్లోకి వెళితే... గుల్బార్గాకు చెందిన షేక్ మోసిన్ భార్యతో కలిసి బేగంపేటలో నివసిస్తున్నాడు. కాగా... గురువారం రాత్రి మోసిన్ దంపతులతో కలిసి అతని స్నేహితుడు అబ్బు వచ్చిచేరాడు. అబ్బు బోరబండకు చెందిన వాడు కాగా...మోహిన్ తో కొన్నేళ్లుగా పరిచయం ఉంది.

అమీర్ పేటలో గురువారం రాత్రి మోహిన్ దంపతులు, అబ్బు కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తు తలకి ఎక్కి న అబ్బు.. మోహిన్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో మోహిన్, అబ్బుల మధ్య ఘర్షణ జరిగింది. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని మోహిన్... తన మిత్రుడు అబ్బుని మందలించే ప్రయత్నం  చేశాడు.

అయితే... మద్యం మత్తులో స్నేహితుడు ఏం చెబుతున్నాడో కూడా వినిపించుకునే స్థితిలో లేని అబ్బు.. పదునైన ఆయుధం తీసుకొని మోహిన్ పై దాడి చేశాడు. కాగా.. తీవ్ర రక్తస్రావమై మోహిన్ మృతి చెందాడు. కాగా... పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అబ్బు కోసం గాలిస్తున్నారు.