సవతి తల్లిని ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. వెంటాడి.. రోడ్డుపై పరుగులు పెట్టించి మరీ తలపై కర్రలతో  కొట్టి  చంపేశాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నేరేడ్ మెట్ లో మంగళవారం సాయంత్రం  చోటుచేసుకుంది

పూర్తి వివరాల్లోకి వెళితే... వినాయకనగర్‌లో ఉండే యాదగిరి (60) లాలాగూడ రైల్వే వర్క్‌షాపులో ఉద్యోగి. ఆయన మొదటి భార్య భారతమ్మ రెండేళ్ల క్రితం మృతిచెందింది. యాదగిరి, భారతమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. చిన్న కుమారుడైన కృష్ణ ప్రసాద్‌ యాదవ్‌, వినాయకనగర్‌లో ఉంటూ పాల వ్యాపారం చేస్తున్నాడు.

Also Read హీరో చెల్లి పాత్ర నీకే అని నమ్మించి......
 
తండ్రి యాదగిరి, నాన్నమ్మ లక్ష్మమ్మ (80), కృష్ణప్రసాద్‌ వద్దే ఉంటున్నారు. కొన్నాళ్లుగా తండ్రిని, నానమ్మను కృష్ణప్రసాద్‌ సరిగా చూడటం లేదు. ఈ కారణంగా యాదగిరి, శంషాబాద్‌కు చెందిన దూరపుబంధువు లలిత (45)ను గత నవంబరులో రెండో పెళ్లి చేసుకున్నాడు. భార్య, తల్లితో కలిసి కొడుకు వద్దే యాదగిరి ఉంటున్నాడు. 

గత డిసెంబరులో యాదగిరి రిటైర్‌ అయ్యాడు. పదవీ విరమణ కింద రూ.23లక్షలు వచ్చాయి. డబ్బులొచ్చాక కృష్ణప్రసాద్‌ కారణంగా కుటుంబంలో తగాదాలు రావడంతో యాదగిరి, తన తల్లి, భార్యతో కలిసి నెలక్రితం దీన్‌దయాళ్‌నగర్‌లోని ఇంటికి మారాడు.

 డబ్బులను మారుతల్లి లలితకే ఇస్తాడేమోనని అనుమానం పెంచుకున్న కృష్ణప్రసాద్‌, ఆమెను చంపేందుకు నిర్ణయించాడు. దుడ్డుకర్ర తీసుకొని బైక్‌పై సాయంత్రం లలిత ఇంటికి చేరుకొన్నాడు. ఆమెను రోడ్డుపై పరిగెత్తించిమరీ అతి కిరాతకంగా హత్య  చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.