భార్య చికెన్ వండలేదని ఓ భర్త దారుణానికి తెగించాడు. యాసిడ్ తాగి ప్రాణాలు తీసుకున్నాడు. మద్యం మత్తులో చేసిన ఈ దారుణంతో ఓ కుటుంబం అనాథగా మారిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ లోని దుండిగల్ లో జరిగింది.
హైదరాబాద్ : పీకలదాకా liquor తాగి chicken తీసుకుని ఇంటికి వెడితే భార్య వండలేదని కోపంతో acid తాగి ఆసుపత్రిపాలైన భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. దుండిగల్ ఇన్ స్పెక్టర్ రమణారెడ్డి వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా కేతిరెడ్డిపల్లి చింతకుంట తండాకు చెందిన ఆటో డ్రైవర్ రతన్ లాల్ (32), రాధిక దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. మూడేళ్ల క్రితం బతుకుదెరువుకు వచ్చి దుండిగల్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 25 సాయంత్రం మద్యం తాగి కోడి మాంసం కొని ఇంటికెళ్లాడు.
కూతురికి అమ్మవారు సోకినందున మాంసాహారం తినొద్దని, ఇంట్లో ఒండద్దని రాధిక భర్తకు నచ్చజెప్పింది. అయినా అతను వినలేదు. మరుసటి రోజు తాను suicide చేసుకుంటున్నట్లు తల్లికి ఫోన్ చేసి యాసిడ్ తాగి ఇంటికొచ్చాడు. అస్వస్థతకు గురైన అతడు చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి దాటాక మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు.
చెల్లిని చంపి...
ఇదిలా ఉండగా, మార్చి 5న ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి దారుణమే జరిగింది. chicken curry వండలేదని సోదరుడే చెల్లిని చంపిన సంఘటన East Godavari District కూనవరం మండలం కన్నాపురంలో చోటుచేసుకుంది. సీఐ గజేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనను చూసేందుకు telanganaలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో నివసిస్తున్న చెల్లెలు సోమమ్మ(20) ఘటన జరగడానికి వారం కిందటే కన్నాపురం వచ్చింది. రెండు రోజుల్లో వస్తాను అని నంద భార్య పుట్టింటికి వెళ్ళింది. ఘటన జరిగిన రోజు రాత్రి నంద పదింటికి liquor మత్తులో కోడి మాంసం ఇంటికి తీసుకొచ్చాడు.
కోడి కూర వండు అన్నాడు. సోమమ్మ నీరసంగా ఉందని చెప్పడంతో గొడవకు దిగాడు. ఇంటికి వచ్చేసరికి ఉండాలని చెప్పి అతడు బయటకు వెళ్ళిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున వచ్చిన నంద కోడి కూర వడ్డించాలని కోరగా.. ఆమె వండలేదని చెప్పడంతో దాడికి యత్నించాడు. ఆమె అరుస్తూ బయటకు పరిగెడుతూ ఉండగా వెంటాడి గొడ్డలితో నరికాడు. ఆమె కేకలు విన్న చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకునేసరికి సోమమ్మ రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది. అతడిని గ్రామస్తులు చెట్టుకు కట్టేశారు. నిందుతుడిని అదుపులోకి తీసుకున్నామని సిఐ తెలిపారు.
సాయంత్రం వండిపెడతానన్నందుకు...
గతంలో కూడా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా కానూరుకు చెందిన సత్యనారాయణ ఉపాధి నిమిత్తం తన కుటుంబంతో కలిసి హైదరాబాద్.. జూబ్లీహిల్స్ లో భార్య దేవకి, కొడుకు ధనేశ్వర్, కూతురు మల్లీశ్వరితో కలిసి ఉంటున్నాడు. అయితే మద్యానికి బానిసైన సత్యనారాయణ రోజూ మద్యం సేవించి భార్యను వేధించేవాడు. ఇలాగే ఆ రోజు ఉదయం కూడా ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన ఆయన భార్యకు చికెన్ వండమని చెప్పాడు. అయితే అప్పటికే కూలీ పనులకు వెళ్లడానికి సిద్దమైన దేవకి సాయంత్రం వచ్చాక వండిపెడతానని చెప్పి కొడుకుతో కలిసి బైటికి వెళ్లిపోయింది. కూతురు కూడా స్కూల్ కి వెళ్లిపోయింది. భార్య తాను చెప్పిన మాట వినలేదని మనస్తాపానికి గురైన సత్యనారాయణ మద్యం మత్తులో ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
