హైదరాబాద్ (hyderabad) మాదాపూర్‌లో ప్రియురాలిపై ప్రియుడు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాడు. వేరే యువకుడితో సన్నిహితంగా ఉందంటూ ప్రియురాలిపై కక్ష పెంచుకున్న యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడు లాలూ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
హైదరాబాద్ (hyderabad) మాదాపూర్‌లో (madapur) దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై ప్రియుడు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాడు. వేరే యువకుడితో సన్నిహితంగా ఉందంటూ ప్రియురాలిపై కక్ష పెంచుకున్న యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడు లాలూ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైటెక్ సిటీ ఔట్ పోస్ట్ వద్ద యువతిపై అత్యాచారం చేసి హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. నిందితుడు లాలూ ప్రసాద్ (lalu prasad) నేరాన్ని అంగీకరించాడు. నరేష్ అనే యువకుడితో తిరుగుతోందని చంపినట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇకపోతే..మరో కేసులో Mahabubabad జిల్లా నెల్లికుదురు మండలం Alair లో సుప్రియ అనే యువతి Suicide చేసుకోవడం కలకలం రేపింది. తన చావుకు నలుగురు కారణమని ఆమె సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృుతురాలిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. దీంతో ఆమె ఈ నెల 18న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు ఇవాళ మరణించిందని పోలీసులు తెలిపారు.
యాట సాగర్, నయీం, సద్దాం హుస్సేన్,జగదీష్ అనే నలుగురు వ్యక్తుల పేర్లను సుప్రియ సూసైడ్ నోట్ రాసింది. తన జీవితాన్ని ఈ నలుగురు నాశనం చేశారని ఆమె రాసింది. మృతురాలు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతురాలు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. మృతురాలి ఇంటికి పక్కనే ఉన్న మూడో ఇంట్లో ఉంటున్న సాగర్ సహా అతని స్నేహితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి
