వీరికి ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. తరచూ కూతురు, అల్లుడి మధ్య గొడవలు జరగడంతో పలుమార్లు పెద్దలు సర్దిచెప్పారు.


కూతురితో అల్లుడు తరచూ గొడవలు పడుతూనే ఉన్నాడు. ఇద్దరి మధ్య గొడవలు తీర్చాలని.. కూతురు, అల్లుడు సఖ్యంగా ఉండాలని ఆయన తాపత్రయపడ్డాడు. కానీ.. మధ్యలో వెళ్లినందుకు.. అల్లుడు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని మియాపూర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

షేక్‌ హఫీజ్‌ (47) సుభాష్‌చంద్రబోస్‌నగర్‌లో ఉంటూ క్యాబ్‌డ్రైవర్‌గా చేస్తున్నాడు. తన కుమార్తె రేష్మాబేగంను ఆదిత్యనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ ఉమర్‌కు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం చేశాడు. వీరికి ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. తరచూ కూతురు, అల్లుడి మధ్య గొడవలు జరగడంతో పలుమార్లు పెద్దలు సర్దిచెప్పారు.

 మళ్లీ గొడవ జరగడంతో ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో నచ్చ చెప్పేందుకు వెళ్లిన హఫీజ్‌కు, అల్లుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో హఫీజ్‌ మెడపై ఉమర్‌ కత్తితో వేటు వేశాడు. హఫీజ్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌, ఎస్‌ఐ రవికిరణ్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.