ప్రియుడి చేతిలో ఆమె హతం: ఆమె ప్రియుడిని చంపిన భర్త

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 30, Aug 2018, 3:15 PM IST
man kills accused in his wife's murder case
Highlights

 తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని ....చివరికి ఆమెను హతమార్చిన వ్యక్తిని ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మక్తల్ మండలంలోని సత్యవార్‌లో చోటుచేసుకుంది. సత్యవార్ గ్రామానికి చెందిన కుర్మన్న(45) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన సాకలి ఆంజనేయులు భార్య పద్మమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పద్దతి మార్చుకోమని హెచ్చరిస్తే కుర్మన్న ఆమెను తీసుకుని హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. 

మహబూబ్ నగర్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని ....చివరికి ఆమెను హతమార్చిన వ్యక్తిని ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మక్తల్ మండలంలోని సత్యవార్‌లో చోటుచేసుకుంది. సత్యవార్ గ్రామానికి చెందిన కుర్మన్న(45) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన సాకలి ఆంజనేయులు భార్య పద్మమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పద్దతి మార్చుకోమని హెచ్చరిస్తే కుర్మన్న ఆమెను తీసుకుని హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. 

హైదరాబాద్ లో కుర్మన్న,పద్మల సంబంధం కొన్నాళ్లు సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో కుర్మన్న పద్మమ్మను హత్య చేశాడు. హైదరాబాద్   చందానగర్ పోలీస్ స్టేషన్లో ఈ హత్యకు సంబంధించి కేసు నమోదైంది. జైలు నుంచి విడుదలైన కుర్మన్న అప్పటి నుంచి ఒంటరిగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. నెలరోజుల క్రితం సత్యవార్ లోని భార్య శంకరమ్మ దగ్గరికి వచ్చాడు కుర్మన్న. కుర్మన్న సత్యవార్ వచ్చాడన్న విషయం తెలుసుకున్న పద్మమ్మ భర్త ఆంజనేయులు ప్రతీకారంతో రగిలిపోయాడు

తన భార్య పద్మమ్మను తనకు కాకుండా చెయ్యడంతోపాటు ఆమె ప్రాణాలు బలితీసుకున్న కుర్మన్నను హత్య చెయ్యాలని పగతో ఉన్నాడు ఆంజనేయులు. అవకాశం కోసం కాపుకాశాడు. అయితే కుర్మన్న గ్రామ శివారులోకి వెళ్ళాడన్న విషయం తెలుసుకున్న ఆంజనేయులు అతనిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. నిందితుడు ఆంజనేయులు అక్కడ నుంచి పరారయ్యాడు. 

ఆంజనేయులు హత్యకు గురైన విషయాన్ని గమనించిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుక గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు కుర్మన్నకు భార్య శంకరమ్మ, ఒకు కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రశాంతమైన గ్రామంలో హత్య జరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

loader