సులభంగా డబ్బులు సంపాదించాలనుకొని ఓ యువకుడు చేసిన పని.. అతని పాలిట యమపాశమైంది.


సులభంగా డబ్బులు సంపాదించాలనుకొని ఓ యువకుడు చేసిన పని.. అతని పాలిట యమపాశమైంది. కష్టపడి సంపాదించే సత్తువ లేక.. అమ్మాయి వేషం వేసుకున్నాడు. అచ్చం అమ్మాయిలా మారి.. అందరి దగ్గర డబ్బులు యాచించేవాడు. అయితే.. అతన్ని నిజమైన అమ్మాయిగా భావించి ఓ వ్యక్తి తన కామ వాంఛ తీర్చుకుందామనుకున్నాడు. 

తీరా.. బేరం కుదర్చుకున్నాక అమ్మాయి కాదు మగవాడు అని తెలుసి.. అతను కోపంతో ఊగిపోయాడు. తనను మోసం చేస్తావా అంటూ సహనం కోల్పోయి రాయితో తలపై మోది, అతను వేసుకున్న చున్నీ తోనే గొంతుకు బిగించి హత్య చేశాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వనపర్తి జిల్లా, వీపనగండ్ల మండలం తూంకుంటకు చెందిన మందా అర్జున్‌ ఫిబ్రవరి 10న జడ్చర్ల సమీపంలోని బూరెడ్డిపల్లి వద్ద హత్యకు గురయ్యాడు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు విచారణలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సులువుగా డబ్బు సంపాదించాలని అర్జున్‌ ఆడవేశం కట్టాడు. 

ఇలా ఎంతోమందిని మోసం చేశాడు. మధ్య ప్రదేశ్‌ రాష్ట్రం సాగర్‌ జిల్లాకు చెందిన భరత్‌లాల్‌రాయ్‌ పోలెపల్లి సెజ్‌లోని శ్రీనివాస సింథెటిక్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి పెళ్లై మూడేళ్లబాబు ఉన్నాడు. గతనెల 10 కామవాంఛ తీర్చుకునేందుకు రాత్రి 9 గంటల సమయంలో హైవే పైకి వెళ్లాడు. ఆ సమయంలో బస్టాప్‌లో లేడీ గెటప్‌లో అతన్ని చూశాడు. అతన్ని వద్దకు వెళ్లి రూ. 400కు బేరం మాట్లాడుకున్నాడు.

ఆటో మాట్లాడుకుని ఇద్దరూ కలిసి ఆటోలో బూరెడ్డిపల్లి వద్ద దిగారు. పక్కనే పొదల్లోకి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక తను ఆడకాదు మగ అని తేలడంతో భరత్‌ ఆగ్రహంతో ఊగిపోయాడు. తనను మోసం చేస్తావా అంటూ పక్కనే ఉన్న రాయి తీసుకుని అర్జున్‌ తల పగలకొట్టాడు. అతను వేసుకుని చున్నీతో గొంతుకు బలంగా బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అతను ఇచ్చిన రూ. 400 నగదుతోపాటు అర్జున్‌ స్మార్ట్‌ ఫోన్‌ తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.