భార్య వివాహేతర సంబంధం.. కొడుకులతో కలిసి వ్యక్తిని హత్య చేసిన భర్త...
పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని ఆ మహిళ భర్త, ఇద్దరు కుమారులు, అన్నదమ్ములు కలిసి చంపేశారు. ఈ ఘటన కీసరలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : వివాహిత మహిళతో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. ఆ మహిళ భర్త, ఇద్దరు కొడుకులు కలిసి వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. కీసర ఇన్స్పెక్టర్ రఘువీరారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన రుద్రబోయిన బాలరాజ్ గౌడ్ (36) నాలుగేళ్ల క్రితం సొంత గ్రామం నుంచి భార్య, ఇద్దరు పిల్లలతో వ్యాపారరీత్యా ఉప్పల్ లో ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ తో పాటు మద్యం వ్యాపారం చేస్తున్నాడు. ఇంటి పక్కనే ఉండే రమేష్ భార్య మంజులతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ విషయం తెలియడంతో మంజుల భర్త రమేష్ చాలాసార్లు బాలరాజ్ గౌడ్ హెచ్చరించాడు. ఎంత చెప్పినా వినక పోవడంతో రమేష్ ఒకసారి బాలరాజ్ గౌడ్ పై దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టాడు. బాలరాజు గౌడ్ వ్యవహారం నచ్చని అతని భార్య మమత ఇద్దరు పిల్లలను తీసుకుని అమ్మ గారి ఇంటికి వెళ్లి పోయింది. ఆ తరువాత బాలరాజ్ గౌడ్ మంజులను తీసుకొని వెళ్ళి పోయి.. కొన్ని రోజులుగా మేడ్చెల్ లో ఉన్నాడు. ఆ తర్వాత కీసర మండలం గోధుమకుంట మైత్రినగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
వీరి ఆచూకీ తెలుసుకున్న రమేష్ ఎలాగైనా బాలరాజు గౌడ్ నుహతమార్చాలని పథకం వేశాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆటోలో తన ఇద్దరు కొడుకులు అరుణ, తరుణ్ తో పాటు మంజుల ఇద్దరు సోదరులతో కలిసి బాలరాజు గౌడ్ అద్దెకు ఉంటున్న ఇంటికి వచ్చాడు. కొద్దిసేపు బాలరాజ్ గౌడ్ తో వాగ్వాదానికి దిగాడు. గొడవ తీవ్రమై కర్రతో పాటు ఇటుకతో బాల్రాజ్ గౌడ్ తలపై కొట్టాడు. రమేష్ పెద్ద కొడుకు బయట ఉండగా చిన్న కొడుకు తరుణ్ తో కలిసి.. బాలరాజ్ గౌడ్ కింద పడగానే.. పక్కనే ఉన్న బట్టతె ఊపిరాడకుండా చేసి కత్తి, స్క్రూ డ్రైవర్ తో విచక్షణారహితంగా పొడిచి చంపారు.
ఇబ్రహీంపట్నంలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్: మూడు రోజుల్లో నలుగురు మృతి, విచారణకు ఆదేశం
అక్కడే ఉన్న మంజుల వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో బాలరాజు మృతదేహం పోస్టుమార్టం గాంధీ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని మహిళలతో పాటు ఆమె భర్త రమేశ్, ఇద్దరు కుమారులు, మంజుల సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రఘువీరారెడ్డి తెలిపారు.