అక్క కుటుంబానికి దగ్గరై మెప్పు పొందాలని.. కోడలి కిడ్నాప్.. చివరికి అరెస్టై జైలుకు.. ఎక్కడంటే...
ఈ నెల 21న బాలుడు పాఠశాల వద్దకు స్నేహితులని పంపాడు. రోజూలాగా కాకుండా వేరే వ్యక్తులు రావడంతో అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో భయపడిన తల్లి పిల్లవాడిని తానే తీసుకెళ్తానని చెప్పడంతో పథకం బెడిసి కొట్టింది. దీంతో మరో ఎత్తు వేశాడు. గురువారం కీర్తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఆడుకుంటున్నప్పుడు మైనర్ అయిన తన సోదరుడు, అతని స్నేహితులతో కిడ్నాప్ చేయించాడు.
హైదరాబాద్ : ఏదో అనుకుంటే ఇంకేదో అయింది.. బంధువుల ముందు హీరోయిజం చూపించాలని.. Kidnapping drama నడిపించిన యువకుడు, అతనికి సహకరించిన స్నేహితులు జైలుపాలయ్యారు. గురువారం సికింద్రాబాద్ లో Three-year-old child కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. పోలీసులను ఉరుకులుపరుగులు పెట్టించింది. రాత్రి జీడిమెట్లలో చిన్నారి కనిపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గోపాలపురం ఇన్స్పెక్టర్ సాయిఈశ్వర్ గౌడ్ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
సీతాఫల్మండికి చెందిన సిరివెల్లు సాయిరాం (25) అక్వేరియం వ్యాపారి. రెజీమెంటల్ బజార్ లో అతనికి వరుసకు సోదరి అయ్యే ఉమా, ఆమె భర్త శ్రీనివాస్, వారి పిల్లలు తరుణ్(6), కీర్తన (3) ఉంటున్నారు. ఆ కుటుంబం మెప్పు పొంది వారికి దగ్గర కావాలని సాయిరాం ప్రయత్నించేవాడు. దీనికోసం తరుణ్ ను కిడ్నాప్ చేసి తానే వెతికి అప్పగించినట్లు చూపాలనే పథకం వేశాడు.
పక్కా స్కెచ్...
దీంట్లో భాగంగా మొదటి ప్రయత్నంగా.. ఈ నెల 21న బాలుడు పాఠశాల వద్దకు స్నేహితులని పంపాడు. రోజూలాగా కాకుండా వేరే వ్యక్తులు రావడంతో అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో భయపడిన తల్లి పిల్లవాడిని తానే తీసుకెళ్తానని చెప్పడంతో పథకం బెడిసి కొట్టింది. దీంతో మరో ఎత్తు వేశాడు.
ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
గురువారం కీర్తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఆడుకుంటున్నప్పుడు మైనర్ అయిన తన సోదరుడు, అతని స్నేహితులతో కిడ్నాప్ చేయించాడు. వారిని చింతల్ లో ఉండమని చెప్పాడు. బిడ్డ కనిపించక వెతుకుతున్న తల్లి ఉమా కు, ఇద్దరు యువకులు చిన్నారిని తీసుకెళ్లారని ఒక మహిళ చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు వెంటనే టాస్క్ఫోర్స్ బృందాలతో రంగంలోకి దిగారు. చిన్నారిని కిడ్నాప్ చేసింది వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి అని గుర్తించారు. చింతల్ లో ఉన్న సాయిరాం స్నేహితుడు నితిన్ కుమార్ ఇంట్లో వెతకగా చిన్నారి కనిపించింది. గురువారం రాత్రి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.
నిందితుడు చేసిన చిన్న తప్పు ...
చిన్నారి కిడ్నాప్ తో ఆందోళనకు గురైన శ్రీనివాస్ దంపతులను నిందితుడు ఓదార్చాడు. తాను కూడా వెతుకుతున్నట్లు నటించాడు. పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందాలు పిల్లల పాఠశాల వద్ద ఆరా తీశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కొందరు సాయిరాంపై అనుమానం వెళ్లిపోవడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. పాఠశాలలో ఉన్న తన కోసం వచ్చిన ఇద్దరితో సాయిరాం వీడియో కాల్ లో మాట్లాడినట్లు తరుణ్ పోలీసులకు చెప్పాడు. చింతలో ఉన్న చిన్నారి ఆచూకీ తానే గుర్తించినట్టు సాయిరాం పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు.
పోలీసులు నితిన్ ను ప్రశ్నించడంతో కిడ్నాప్ డ్రామా బయటపడింది. ప్రధాన సూత్రధారి సాయిరాం ( 25), నితిన్ కుమార్ ( 21), ముగ్గురు మైనర్ లను అరెస్ట్ చేశారు బంధువుల నుంచి మెప్పు పొందేందుకు అపహరణకు పాల్పడినట్లుగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.