హైదరాబాద్ పాతబస్తీలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. గంజాయి మత్తులో ఉన్న అతడు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై దాడికి దిగారు. 

హైదరాబాద్ పాతబస్తీలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. గంజాయి మత్తులో ఉన్న అతడు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై దాడికి దిగారు. ఈ ఘటనలో 3 ఆటోలు, ఒక కారు అద్దాలు ధ్వంసం అయ్యారు. వివరాలు.. పాతబస్తీలోని కాలపత్తర్ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఓ వ్యక్తి నానా హంగామా సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై దాడికి దిగాడు. అలాగే వద్దని వారించిన వారిపై కూడా దాడి చేశారు. ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, వాహనదారులు.. ఆ వ్యక్తిని చితకబాదారు. ఈ ఘటనతో అక్కడ చిన్నపాటి ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

ఇదిలా ఉంటే.. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లోని ఆసిఫ్నగర్లో కొందరు యువకులు గంజాయి మత్తులో హల్‌చల్ చేశారు. జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్ దగ్గర యువకులు గంజాయి మత్తులో నానా హంగామా చేశారు. వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. ఇందుకు సంబంధించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. యవకులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. అయితే గంజాయి మత్తులో ఉన్న యువకులు పోలీసు వాహనం ఎక్కి నానా రచ్చ చేశారు. 

పోలీసు వాహనంతో పాటు అక్కడ ఉన్న పలు వాహనాల అద్దాలను పగలగొట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొనేందుక కఠినంగా వ్యవహరించారు. యువకులపై లాఠీ‌లతో దాడి చేసి.. అదుపులోకి తీసుకున్నారు. యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వారికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.