నకిలీ వీసాలతో ఓ వ్యక్తి దుబాయ్ చెక్కేసేందుకు ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ బెడసి కొట్టడంతో... చివరకు జైలుపాలయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రసాద్ అనే యువకుడిని సీఐఎస్‌ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు ప్రసాద్ అనే యువకుడు ప్రయత్నించాడు. అతడిపై అనుమానంతో అతడి వీసాను అధికారులు చెక్ చేయడంతో అది నకిలీ అని తేలింది. దీంతో ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.