Asianet News TeluguAsianet News Telugu

‘నాకు లొంగకపోతే.. నీ తల్లి వివాహేతర సంబంధం చెప్పి.. నీకు పెళ్లి కాకుండా చేస్తా’ యువతికి కామాంధుడి బెదిరింపులు

‘నీ తల్లి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.. నువ్వు లొంగకపోతే ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలియజేసి.. నీకు పెళ్లి కాకుండా చేస్తానంటూ’ ఓ యువతిని ఓ నీచుడు బ్లాక్ మెయిల్ చేశాడు. దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడం, తల్లి extra marital affair గురించి పట్టించుకోకపోవడంతో ఆ నీఛుడు ఆమె మీద sexual assaluteకి పాల్పడ్డాడు. 

man harassing and molested a girl in jubilee hills, hyderabad, arrested
Author
Hyderabad, First Published Nov 17, 2021, 1:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బంజారాహిల్స్ : మహిళలపై లైంగిక దాడులకు ప్రత్యేకంగా సమయం, సందర్భం, వావి వరసలు, కారణాలు కనిపించడం లేదు. వారిని వేధించడానికి ఏ చిన్న అవకాశం దొరికినా కీచకులు వదలడం లేదు. అకారణంగా వేధించడం, లొంగిపొమ్మంటూ ఒత్తిడి తీసుకురావడం.. ఒప్పుకోకపోతే దారుణంగా హింసించడం లాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా రోజూ ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. అలాంటి కోవలోకి వచ్చే ఘటనే తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. 

‘నీ తల్లి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.. నువ్వు లొంగకపోతే ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలియజేసి.. నీకు పెళ్లి కాకుండా చేస్తానంటూ’ ఓ యువతిని ఓ నీచుడు బ్లాక్ మెయిల్ చేశాడు. దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడం, తల్లి extra marital affair గురించి పట్టించుకోకపోవడంతో ఆ నీఛుడు ఆమె మీద sexual assaluteకి పాల్పడ్డాడు. 

ఈ నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడు గ్రామానికి చెందిన పూర్ణకంటి నవీన్ (29) గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తూ రహ్మత్ నగర్ లో అద్దెకు ఉంటున్నారు. 

గత రెండు సంవత్సరాల నుంచి స్థానికంగా నివసిస్తున్న ఓ విద్యార్థినిని వెంబడిస్తూ, లైంగికంగా వేధిస్తూ తనతో రాకపోతే అంతు చూస్తానంటూ threten చేస్తున్నాడు. పలుమార్లు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక ఆదివారం ఉదయం మరీ దారుణానికి దిగజారాడు. ఆ ఉదయం నవీన్ నేరుగా ఆ యువతి houseకి వచ్చి తలుపు తట్టాడు. కానీ వచ్చింది నవీన్ అని తెలుసుకున్న ఆమె తలుపు తీయలేదు. భయంతో వణికిపోయింది. వెంటనే బాధితురాలు 100కు డయల్ చేసింది. 

Peddapalli: పెద్దపల్లి తహశీల్దార్, ఆర్‌ఐ‌తో 9 మందిపై కేసు.. బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో..

ఈ సమయంలో పెట్రోలింగ్ పోలీసులు త్వరితగతిన స్పందించారు. యువతి dial 100 కి కాల్ చేసిన క్షణాల్లో.. బాధితురాలి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయంలో తెలియని accussed నవీన్ ఇంకా అక్కడే తలుపులు బాదుతూ ఉన్నాడు. అతన్ని policeలు అదుపులోకి తీసుకున్నారు. 

తాను కాలేజీకి వెళ్లే సమయంలో వెంబడిస్తున్నాడని,  బైక్ పై Forcedగా కూర్చోబెట్టుకుంటున్నాడని.. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. అది భరించలేక తాను ఎదురుతిరిగితే.. తన తల్లికి Illicit relationships ఉన్నాయంటూ ప్రచారం చేస్తానని... వేధిస్తున్నట్లు కూడా ఆరోపించింది. 

ఇదంతా వింటున్న నిందితుడు పోలీసులను చూసి పెదవి విప్పలేదు. పోలీసులు నిందితుడి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ నవీన్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఇరుగు పొరుగు వారు హర్హం వ్యక్తం చేస్తున్నారు. యువతులను ఇష్టారాజ్యంగా వేధించినా ఎవ్వరూ పట్టించుకోరనుకునే ఇలాంటి జులాయిలకు ఈ ఘటన చెంపపెట్టుగా చెబుతున్నారు. ఫోన్ చేసిన క్షణాల్లో స్పందించిన డయల్ 100 సిబ్బందిని, పోలీసులను అభినందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios