కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిన కన్న తండ్రే... కూతురిపట్ల రాక్షసుడిగా మారాడు. మైనర్ బాలికపై దాదాపు ఐదు సంవత్సరాలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... ఆ కామాంధుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తికి భార్య , ఒక కుమార్తె, ఒక కొడుకు ఉన్నారు. కాగా.. వ్యక్తి రోజు కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య కూడా కూలి పనులు చేస్తూ... అతనికి సహకరించేది. కాగా.... అతను సొంత కూతురిపైనే కన్నేశాడు. ఇంట్లో భార్య లేని సమయంలో కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఇదే పని రోజూ చేయడం ప్రారంభించాడు. దాదాపు ఐదు సంవత్సరాలపాటు కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. ఓ రోజు బాలిక ఈ నరకాన్ని రోజూ భరిస్తూనే వస్తోంది. ఈ విషయం ఆమె తల్లికి తెలిసినా.. ఆమె ఎలాంటి సహాయం  చేయలేకపోయింది. దీంతో... బాలిక విషయాన్ని తన స్కూల్లో టీచర్ కి తెలియజేసింది. తన శరీరంలో వస్తున్న మార్పులు.. తన తండ్రి తన పట్ల చేస్తున్న పనిని బాలిక టీచర్ కి వివరించింది.

కాగా... వెంటనే ఆ టీచర్ ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పి నిజమేంటో అడిగి తెలుసుకుంది. బాలిక చెప్పిందంతా నిజమని తెలియడంతో ఆ టీచర్ బాలిక తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఇటీవల అతనిని కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం కేసును పూర్తిగా పరిశీలించింది.

కన్నకూతురిపైనే అతికిరాతకంగా ఐదు సంవత్సరాలపాటు అత్యాచారానికి పాల్పడినందుకు అతనికి జీవిత ఖైదు విధించారు. అంతేకాకుండా రూ.2వేల జరిమానా కూడా విధించారు.