నందినగర్‌కు చెందిన బి. లాలు (37) అనే నిందితుడు 100కు డయల్ చేసి తన సోదరుడిని తల్లిదండ్రులే హత్య చేశాడని పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అది తప్పుడు ఫిర్యాదు అని తేలింది. ఫోన్ చేసిన వ్యక్తి సోదరుడు అనారోగ్యంతో నెల రోజుల క్రితం చనిపోయాడు.

హైదరాబాద్ : తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఓ వ్యక్తికి Local court సోమవారం మూడు రోజుల జైలు శిక్ష విధించింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం నందినగర్‌కు చెందిన బి. లాలు (37) అనే నిందితుడు 100కు డయల్ చేసి తన సోదరుడిని తల్లిదండ్రులే హత్య చేశాడని పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అది తప్పుడు ఫిర్యాదు అని తేలింది. ఫోన్ చేసిన వ్యక్తి సోదరుడు అనారోగ్యంతో నెల రోజుల క్రితం చనిపోయాడు.

అలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నించగా, సరదా కోసం Dial 100 కు చేసినట్లు నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు పోలీసులు ఈ-పెట్టీ కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా మూడు రోజుల 
Imprisonment విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో జరిగిన మరో దారుణ ఘటనలో.. వాహనాల బ్యాటరీలు దొంగతనం చేశారనే నెపంతో ఇద్దరు యువకులను స్థంబానికి కట్టేసి గుండు కొట్టించారు. స్థానికులు, ఈ ఘటనపై బాధితులు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Shamshabad లోని అహ్మద్ నగర్ లో నివాసం ఉండే ఖుద్దూస్, ఖాజాలు old scrap వ్యాపారం చేస్తుంటారు. అయితే వాహనాల battery లను దొంగతనం చేస్తారని వీరిపై ఆరోపణలున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోని వాహనాల బ్యాటరీలు చోరీకి గురౌతున్నాయి.

సినీ ఫక్కిలో దోపిడీ.. భార్యగా మెట్టినింటికీ.. అంతలోనే నగదు సర్దుకుని పరార్

దీంతో స్థానికులు ఈ బ్యాటరీల కోసం Khaja ఇంట్లో వెతికితే కొన్ని బ్యాటరీలు లభ్యమయ్యాయి. ఖాజా, khuddus లు బ్యాటరీలను చోరీ చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరిని విద్యుత్ స్థంబానికి కట్టేసి చితకబాదారు. అంతేకాదు మళ్లీ ఈ తరహాలో చోరీలకు పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇద్దరికి Head shave చేశారు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఈ అవమానంపై బాధితులు శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను అవమానపర్చిన ఘటనలో ఐదుగురిని శంషాబాద్ పోలీసులు Arrest చేశారు. 

ఇక వరంగల్ లో ఓ కిలాడీ దొంగ ఏకంగా police పర్సునే కొట్టేశాడు. అదీ పోలీస్ స్టేషన్ లోనే. వివరాల్లోకి వెడితే.. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉన్న దొంగ పోలీసుల కళ్లు కప్పి పరారైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ఇటీవల ఓ దొంగతనం కేసులో నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి Mattewada Police Station లో కస్టడీకి అప్పగించారు. 

అర్థరాత్రి తర్వాత పోలీసులు నిద్రిస్తున్న సమయంలో thief వారి కళ్లు గప్పి చాకచక్యంగా పరారయ్యాడు. పారిపోతూ పారిపోతే.. దొంగ బుద్దిని వదలలేదు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్ల పర్సులు, సెల్ ఫోన్స్ సైతం ఎత్తుకెళ్లడం గమనార్హం. కాగా, దొంగకోసం మట్టెవాడ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిసింది.