Asianet News TeluguAsianet News Telugu

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం..రూ.9లక్షల టోకరా

డాక్టర్‌గా పరిచయం చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి ఆ యువతిని పూర్తిగా ట్రాప్ చేశాడు. ఒక రోజు అకస్మాత్తుగా మన స్నేహానికి నిదర్శనంగా ఓ బహుమతి పంపిస్తున్నానంటూ చాటింగ్‌లో చెప్పాడు. దీంతో యువతి ఆ బహుమతి ఏమై ఉంటుందనే ఆశతో ఎదురుచూస్తుంది. ఈ ఖరీదైన బహుమతి మీకు సర్‌ప్రైజ్ ఇస్తుందని అతడు చెప్పాడు.

man dupes woman in instagram
Author
Hyderabad, First Published Sep 2, 2019, 9:48 AM IST

ఇన్ స్టాగ్రామ్ లో గుర్తుతెలియని ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం... ఆమెకు రూ.9లక్షల నష్టం మిగిల్చింది. తనకు తెలీకుండానే ఆ వ్యక్తి ట్రాప్ లో పడిపోయింది. తీరా మోసపోయానని ఆమె గుర్తించేసరికి జరగాల్సిన నష్టం జరిగింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా... ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ యువతికి యూకే దేశస్తుడిగా ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు. మొదటగా ఇద్దరు ఇన్‌స్టాగ్రాంలో హాయ్ చెప్పుకున్నారు. అలా మొదలైన పరిచయం ఫ్రెండ్‌షిప్‌గా మారి రోజు చాటింగ్ చేసుకున్నారు. 

డాక్టర్‌గా పరిచయం చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి ఆ యువతిని పూర్తిగా ట్రాప్ చేశాడు. ఒక రోజు అకస్మాత్తుగా మన స్నేహానికి నిదర్శనంగా ఓ బహుమతి పంపిస్తున్నానంటూ చాటింగ్‌లో చెప్పాడు. దీంతో యువతి ఆ బహుమతి ఏమై ఉంటుందనే ఆశతో ఎదురుచూస్తుంది. ఈ ఖరీదైన బహుమతి మీకు సర్‌ప్రైజ్ ఇస్తుందని అతడు చెప్పాడు.

 ఇంకా సంతోషంలో మునిగిపోయిన ఆ యువతి విదేశీ ఫ్రెండ్ బహుమతి కోసం ఎదురు చూస్తున్నది. ఒక రోజు ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. మేము ఢిల్లీ కస్టమ్స్ అధికార కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరు మీద పార్సిల్ వచ్చింది.. అందులో విదేశీ కరెన్సీతోపాటు బంగారం, వజ్రాలు ఉన్నాయి. దీని విలువ కోట్లాది రూపాయల్లో ఉంటుంది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించినట్లు వారు మాట్లాడారు. 

భయపడిపోయిన ఆ యువతి ఇప్పుడు ఏం చేయాలని అడిగింది. మాకు కొంత నగదు పంపిస్తే ఈ పార్సిల్‌ను మీ చిరునామాకు పంపిస్తామని చెప్పారు. దీంతో మొదట లక్ష రూపాయలు పంపిన యువతి ఆ తర్వాత కస్టమ్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్, యాంటీ టెర్రరిస్టు, జీఎస్టీ సర్టిఫికెట్ ఇలా రకరకాల సర్టిఫికెట్ల పేరుతో లక్షలు చెల్లించగా.. చివరకు యువతి తాను చెల్లించింది లెక్కించుకొని మొత్తం రూ.9లక్షలు వివిధ ఖాతాల్లో వేశానని గ్రహించి విషయాన్ని స్నేహితులతో పంచుకున్నది. 

స్నేహితులు మోసమని చెప్పగానే షాక్‌కు గురైన ఆ యువతి డబ్బును తిరిగి ఇప్పించాలని రాచకొండ సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios