గచ్చిభౌలిలో పుడ్  డెలివరీ బాయ్  చేతిలో కత్తిపోట్లకు గురైన  ఆదిత్య  అనే వ్యక్తి మృతి చెందాడు.  వారం రోజులుగా బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

హైదరాబాద్: పుడ్ డెలివరీ బాయ్ చేతిలో కత్తిపోట్లకు గురైన ఆదిత్య  అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించాడు. వారం రోజులుగా  నిమ్స్ ఆసుపత్రిలో   ఆదిత్య చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.  పుడ్ డెలీవరీ ఆలస్యమైందనే  విషయమై డెలీవరీ బాయ్ తో గొడవ  ఆదిత్య గొడవ పెట్టుకున్నారు.

ఈ గొడవ సమయంలో కోపం పట్టలేక ఇరువురు కొట్టుకున్నారు.అంతేకాదు  కత్తితో పరస్పరం దాడికి దిగారు. పుడ్  డెలివరీ బాయ్ కత్తితో ఆదిత్యను పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆదిత్యను స్ధానికులు నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ఆదిత్య ఇవాళ మరణించాడని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఆదిత్య మరణానికి కారణమైన పుడ్ డెలివరీ బాయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.