కరీంనగర్ జిల్లా, మానకొండూర్ లో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు వస్తున్నారనే భయంతో బైక్ అదుపు తప్పి, అనిల్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. 

కరీంనగర్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూర్ మండలం ముంజంపల్లి బ్రిడ్జి పై నుండి అదుపు తప్పిన బైక్  కాలువలో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లింగాపూర్ గ్రామానికి చెందిన కొమ్ము అనిల్ యాదవ్ (19)సం"లు అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. 

మృతుడు ఇటీవలే ఓ ట్రాక్టర్ కొనుగోలు చేసి.. ఇసుకను  రవాణా చేస్తుండేవాడు.. ఈ రోజు కూడా అనిల్.. పోలీసుల కంట పడకుండా ఉండేందుకు.. ముంజంపల్లి కాకతీయ కాలువ నుండి.. అనిల్ బైక్ పై ముందు వెళుతుండగా.. ట్రాక్టర్ వెనుకాల వస్తోంది. 

ఈ క్రమంలో... ఒక్కసారిగా పోలీసులు కనపడటంతో.. బైక్ లైట్ ఆఫ్ చేసిన అనిల్.. వేగం పెంచడంతో ఈ  ప్రమాదం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.