Asianet News TeluguAsianet News Telugu

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు.. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

మహబూబ్‌నగర్ జిల్లా నందిగామలో లోన్ యాప్ వేధింపులు భరించలేక ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

man commits suicide over loan app harassment in mahabubnagar district
Author
First Published Nov 13, 2022, 4:39 PM IST

తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ వేధింపులు ఆగడం లేదు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా నందిగామలో లోన్ యాప్ వేధింపులు భరించలేక ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం వనపర్తి జిల్లాకు చెందిన ఓ యువకుడు కూడా లోన్ యాప్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కొత్తకోటకు చెందిన శేఖర్.. కొంతకాలం కిందట లోన్ యాప్‌ ద్వారా కొంత డబ్బు తీసుకనున్నారు. కొద్ది రోజులకు దానిని తీర్చేశాడు. అయితే ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉందని.. లోన్ యాప్‌ నిర్వాహకులు శేఖర్‌ను వేధించడం మొదలుపెట్టారు. 

ALso Read:ఫొటోలు మార్పింగ్ చేసి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు.. వనపర్తిలో యువకుడు ఆత్మహత్య..

ఈ క్రమంలో శేఖర్ ఫొటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన శేఖర్.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే శేఖర్ మృతికి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులే కారణమని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించి శేఖర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు

Follow Us:
Download App:
  • android
  • ios