భార్య తనకు రూ.20 ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చోటుచేుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  ఈదమ్మగుడి ప్రాంతానికి చెందిన అర్జునయ్య(57), అతడి భార్య మణెమ్మ స్థానిక మార్కెట్‌యార్డులో హమాలీ పని చేస్తుండేవారు. లాక్‌డౌన్‌తో ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

Also Read కరోనా ఎఫెక్ట్: బయటకు వస్తే ఇక తెలంగాణలో మాస్కులు తప్పనిసరి.

తన వద్ద డబ్బులు లేవని.. ఖర్చులకు ఒక రూ. 20 ఇవ్వాలని అర్జునయ్య మణెమ్మను కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెంది, ఇంటి నుంచి వెళ్లిపోయిన అర్జునయ్య.. జిల్లా శివారులోని కేసరి సముద్రం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని గమనించిన స్థానిక కౌన్సిలర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.