గత మూడు సంవత్సరాలుగా వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారట. పెళ్లి మాటెత్తేసరికి ప్రియుడు ముఖం చాటేశాడని పెళ్లి చేసుకోమంటే తప్పించుకు తిరుగుతున్నాడని, ఆరోపిస్తూ ప్రియురాలు, ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది.  

"

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామానికి చెందిన రవళి అనే యువతి, కదంబాపూర్ గ్రామ ఉపసర్పంచ్ కోట సుమంత్ అనే యువకుడితో పరిచయం ప్రేమగా మారింది. గత మూడు సంవత్సరాలుగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. 

సుమంత్ ను నమ్మి తన సర్వస్వాన్ని అర్పించింది రవళి. అయితే పెళ్లి మాట ఎత్తేసరికి సుమంత్ ఒప్పుకోవడం లేదని, తప్పించుకు తిరుగుతున్నాడని విసుగుచెంది ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది రవళి. 

పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రజాప్రతినిధి ఓ అమ్మాయిని మోసం చేయడం ఏంటని మహిళా సంఘాలు ఆందోళన రైతులకు తోడుగా మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. 

అయితే రెండు సామాజిక వర్గాలు వేరు వేరు కావడంతో తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, సుమంత్ తెలిపాడని రవళి  చెప్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు రవళిని స్థానిక  పోలీసులు పోలీస్ స్టేషన్కు రావాలని సూచించారు. సమంత్ తో తనకు వివాహం జరిపించాలని రవళి డిమాండ్ చేస్తోంది.  ప్రియుడు  సుమంత్  పరారీలో ఉన్నట్లు తెలిసింది.