Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ : నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి కత్తులు, కొడవళ్లతో దారుణ హత్య.. చనిపోయిన వ్యక్తి ఎవరంటే...

ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ఓ వ్యక్తిని అతిదారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తిని అంబర్ పేట్ కు చెందిన కార్పెంటర్ గా పోలీసులు గుర్తించా

man chased, brutally murdered on the road in Hyderabad, victim is a carpenter says police - bsb
Author
First Published Jan 23, 2023, 6:57 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆదివారం నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్య మధ్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.  ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు అతి దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ఆ సమయంలో అక్కడి నుంచి ట్రాఫిక్ కానిస్టేబుల్ రావడం గమనించి వారు అతడిని వదిలేసి పారిపోయారు.  ఈ దారుణ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడలో చోటుచేసుకుంది. కాగా మొదట హత్యకు గురైన వ్యక్తి గురించిన వివరాలు తెలియ రాలేదు. ఆ తర్వాత ఆ వ్యక్తిని జంగం సాయినాథ్ గా గుర్తించారు. సాయినాథ్(29) అంబర్పేట బతుకమ్మ కుంటకు చెందిన వ్యక్తి.  కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. 

ఆదివారం సాయంత్రం ఏదో పనిమీద టూ వీలర్ పై పురానాపూల్ నుంచి జియాగూడ మేకలమండి దగ్గరినుంచి వెళుతున్నాడు. ఈ క్రమంలోనే  పీలి మండవ్ శివాలయం సమీపంలోకి సాయినాథ్ చేరుకోగానే ముగ్గురు ఆగంతకులు హఠాత్తుగా అతడి వాహనానికి అడ్డుగా వచ్చారు. వెంటనే అతనిపై దాడికి దిగారు. ఒకరు ఇనుపరాడ్డుతో సాయినాథ్ తల వెనుక బలంగా కొట్టాడు. దీంతో సాయినాథ్ బండి మీద నుంచి కింద పడిపోయాడు. ఆ తర్వాత కొడవలి, కత్తి, ఇనుపరాడ్లతో ముగ్గురు మూకుమ్మడిగా అతడి మీద దాడి చేశారు.

హైదరాబాద్ : నడిరోడ్డుపై కత్తులతో నరికి దారుణహత్య.. సెల్ఫీలు తీసుకున్న జనం

సాయి నాథ్ సహాయం కోసం గట్టిగా కేకలు వేశాడు. అయినావారు వదలలేదు. అక్కడినుంచి లేచి పరిగెత్తాడు. వాళ్లు కూడా వెంటాడి. వెంటాడి కత్తులతో దాడి చేశారు. కత్తులతో ముఖం, చేతులు, కాళ్లు, పొట్ట భాగంలో విచక్షణారహితంగా నరికారు. ఈ సమయంలో  గోషామహల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ జనార్ధన్ పురాణా పూల్ వైపు నుంచి టూవీలర్ పై వస్తున్నాడు. అతను ఈ దారుణాన్ని దూరం నుండే గమనించి.. కేకలు వేయడంతో.. అది గమనించిన నిందితులు మూసీ నదిలోకి వెళ్లే మెట్ల మార్గం నుంచి దూకి ఘటనా స్థలం నుంచి పారిపోయారు.

అప్పటికే తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని కాపాడేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఈ దారుణానికి సంబంధించిన సమాచారం చేరవేశాడు. అతని సమాచారంతో గోషామహల్ ఏసీపీ ఆర్ సతీష్ కుమార్, కుల్సుంపుర ఇన్స్పెక్టర్ టి అశోక్ కుమార్, క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ దొరికిన ఆధారాలను సేకరించారు. దీనికి సంబంధించి కుల్సుంపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఈ దాడికి కారణం ఆర్థిక లావాదేవీలా? వివాహేతర సంబంధమా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతుడి సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. దీని ప్రకారం అనుమానితులను ప్రశ్నించినట్లు సమాచారం. కాగా ఆదివారం రాత్రి దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు  మరో పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా తెలుస్తోంది.  అయితే దీనిమీద పోలీసు అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఫోటోలు తీస్తూ..
సాయంత్రం అందరూ చూస్తుండగానే నడిరోడ్డు మీద ఒక వ్యక్తిని వెంటాడి, వేటాడి కత్తులతో దాడి చేస్తుంటే… ఆ రోడ్డు మీద ఉన్నవారు ఎవరు అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. పైగా  ఆ ఘటన జరుగుతున్న వైపు నుంచి కార్లలో, టూ వీలర్ల మీద, ఆటోలో వెళుతున్న వారు సెల్ ఫోన్లలో వాటిని ఫోటోలు, వీడియోలు తీశారు. దీని మీద పోలీసు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.  అడ్డుకోవడానికి భయమైతే డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేసినా ఓ ప్రాణం నిలిచేదని వారు అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios