నడిరోడ్డుపై కారు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం

man burns in a car fire accident in hyderabad
Highlights

హైదరాబాద్ లో దారుణం


హైదరాబాద్ లో గతరాత్రి దారుణం చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్‌ సమీపంలోని రిమ్మనగడ్డ వద్ద కారుకు మంటలు అంటుకున్న ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న కారు రిమ్మనగూడ పెట్రోల్ బంక్ దాటగానే మంటలు చెలరేగాయి. కారులో మంటలు రావడాన్ని గమనించిన తోటి వాహనదారులు, స్థానికులు అద్దాలు పగలగొట్టి అందులోని వ్యక్తి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. 

 

చూస్తుండగానే.. మంటలు వేగంగా వ్యాపించడంతో కారులోని వ్యక్తి కళ్ల ముందే సజీవ దహనమయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. 

మంటల తీవ్రతకు మృతుడి ఎముకలు మాత్రమే మిగిలాయి. దగ్ధమైన కారును మారుతి ఆల్టో పెట్రోల్ మోడల్ కారుగా గుర్తించారు. కారు నెంబర్ AP11P 8686 కాగా, అందులో ఒక్కరే ప్రయాణిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 

loader