హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆసిఫ్‌నగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కిషన్ రెడ్డి ఆధివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు.

అయితే అక్కడ మంత్రికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఓ యువకుడు చించేసి, తగులబెట్టాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు సదరు యువకుడిని పట్టుకుని చితకబాదారు.

ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్ధితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.