వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాల్ని దారుణంగా తీసేలా చేసింది. పెళ్లికిముందు నుంచి కొనసాగిన ప్రేమవ్యవహారం చివరికి అతన్ని విగతజీవిని చేసింది. వికారాబాద్ లో మంగళవారం అర్థరాత్రి ఓ యువకుడి దారుణ హత్య జరిగింది. 

వికారాబాద్ : Love affair, extramarital affair నేపథ్యంలో జుంబరి జనార్ధన్ (32) అనే బ్యాంకు ఉద్యోగి హత్యకు గురైన సంఘటన నవాబుపేట మండలం మందాన్ పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఆకుల వెంకటయ్య, పెంటమ్మ దంపతులకు భాగ్యమ్మ, పూర్ణమ్మ ఇద్దరు కూతుళ్లు. వీరికి 10 ఎకరాల పొలం ఉంది. అదే గ్రామానికి చెందిన నరేష్ కు పెద్ద కూతురు పూర్ణమ్మను ఇచ్చి marriage చేశారు. ఆస్తి కోసం ఆశపడి అందరి సమ్మతితో మరదలు భాగ్యమ్మను కూడా రెండేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు.

అదే గ్రామానికి చెందిన జనార్దన్ కు పూర్ణమ్మతో పెళ్లికి ముందు నుంచే ప్రేమ వ్యవహారం ఉంది. ప్రేమ విఫలం కావడంతో అతను sangareddy జిల్లా కోహిర్ మండలానికి చెందిన విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. పూర్ణమ్మ, జనార్థన్ ఇద్దరికీ వివాహం జరిగినా వారి మధ్య పరిచయం కొనసాగుతూనే ఉన్నట్లు తెలిసింది. ఇది తెలిసి, భర్త, కుటుంబసభ్యులు ఎంతగా వారించినా పూర్ణమ్మ పద్ధతి మార్చుకోలేదు. ఇదే విషయమై నెల కిందట గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి కట్టుబాట్లకు లోబడి పద్ధతిగా ఉండాలని నచ్చజెప్పారు.

అయినప్పటికీ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు గుర్తించిన భర్త నరేష్ భార్య ప్రియుడిని హతమార్చాలని మరో ఇద్దరితో కలిసి పథకం వేశాడు. మంగళవారం విధులు ముగించుకుని బైక్పై వస్తున్న జనార్ధన్ ను కాపుకాసి కారుతో ఢీ కొట్టాడు. కింద పడిన అతనిపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. గుర్తించిన గ్రామస్తులు చికిత్స నిమిత్తం హైదరాబాదు తరలిస్తుండగా జనార్థన్ మృతి చెందాడు. మృతుని బంధువులు, గ్రామస్తులు ఆగ్రహంతో నరేష్ కు చెందిన ట్రాక్టర్, జెసిబిలకు నిప్పంటించారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే మార్చి 3న మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఓ భర్త తన wifeను ఇంట్లో ప్రియుడితో కలిసి చూడరాని స్థితిలో చూశాడు. ఇక ఆ భర్త తట్టుకోలేకపోయాడు. ఇద్దరినీ పట్టుకుని చెట్టుకు కట్టేసి మరీ చితకబాదాడు. ఈ సంఘటన madhyapradeshలోని రాజ్ ఘర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ భార్య, భర్త లేని సమయంలో ప్రియుడితో కలిసి ఇంట్లోనే extramarital affairని గత కొన్నాళ్లుగా కొనసాగిస్తూ వచ్చింది. కాగా ఓ రోజు ఇంట్లోనే తన భార్యను మరో వ్యక్తితో చూడడంతో భర్త తట్టుకోలేకపోయాడు. భార్య చేసిన తప్పుడు పని గ్రామస్తులు అందరికీ తెలియజేయాలనుకున్నాడు ఆ భర్త. 
దాంతో ఊరి మధ్యలో ఉన్న ఓ చెట్టుకు కట్టేసి భార్యతో పాటు తన ప్రియుడికి కూడా దేహశుద్ధి చేశారు. వివాహితతో పాటు ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేయడానికి సదరు భర్త బంధువులు కూడా అతనికి అండగా నిలిచారు. ఇలా రెండు గంటల పాటు ఇద్దరిని చితకబాదుతుండగా.. వాళ్ళ అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే స్థానికులు దీనికి సంబంధించిన దృశ్యాలను షూట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త వైరల్ అయింది. 

భర్తతో కాపురం చేస్తూనే మరో వైపు ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం బయట పడడంతో గ్రామస్తులు కూడా వివాహితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భర్త దేహశుద్ధి చేస్తుండగా అందరూ అతనికి మద్దతుగా నిలిచి మహిళను తిట్టి పోశారు.