యువకుడి మర్మాంగాన్ని కత్తిరించి కిరాతక హత్య... అక్రమ సంబంధమే కారణమా? (వీడియో)
ఓ యువకుడి మర్మాంగాన్ని కోసి అత్యంత దారుణంగా హతమార్చారు గుర్తుతెలియని దుండగులు. ఈ అమానుషం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

సిరిసిల్ల : అక్రమ సంబంధాలు అనేక మంది ప్రాణాలను బలితీసుకుంటూ జీవితాలను నాశనం చేస్తున్నాయి. క్షణకాలం ఆనందం కోసం పరాయి మహిళలు, పురుషుల మోజులో పడి వందేళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి అతి దారుణంగా హత్యకు గురయ్యాడు. అతడిని ఇంత కిరాతకంగా చంపడానికి అక్రమ సంబంధమే కారణమని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన పడిగెల నరేష్(25) ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్నాడు. అయితే గత రాత్రి అతడిని గుర్తు తెలియని దుండుగులు అత్యంత కిరాకతకంగా హతమార్చారు. అర్ధరాత్రి నరేష్ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు నిద్రలోవున్న అతడి మర్మాంగాన్ని కట్ చేసారు. నొప్పితో విలవిల్లాడిపోతున్న నరేష్ ను పట్టుకుని కత్తులతో పొడిచారు. రక్తపుమడుగులో కుప్పకూలిన నరేష్ మృతిచెందినట్లు నిర్దాంచుకుని అక్కడినుండి వెళ్లిపోయారు.
వీడియో
ఉదయం నరేష్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులను సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మర్మాంగాన్ని కోసి ఇంత కిరాతకంగా చంపడానికి వివాహేతర సంబంధమే కారణమై వుంటుందని అనుమానిస్తున్నారు. నరేష్ ను చంపిన నిందితులు ఎవరన్నది తెలియాల్సి వుంది.