రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య చెలరేగిన గొడవ హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెడితే..

రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కోపోద్రిక్తుడైన భర్త వెంకటేశం ఆవేశంతో భార్య లచ్చవ్వపై గొడ్డలితో దాడిచేశాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లచ్చవ్వను హుటా హుటీన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి కరీంనగర్ తరలించారు. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొదుతూ లచ్చవ్వ మృతి చెందింది.