రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని హత్య చేసి కొందరు దుండగులు అతని శరీర భాగాలను మూడు ముక్కలుగా కోసి మూడు ప్రాంతాల్లో పడేశారు.

జిల్లాలోని చౌదరి గూడెం కాస్లాబాద్ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు మూడు వేరు వేరు ప్రాంతాల నుంచి తల, గోనె సంచిలో ఉన్న మొండెం, కాళ్లను స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని కాస్లాబాద్ గ్రామానికి చెందిన తట్టెపల్లి రాజుగా గుర్తించారు.

కాగా ఇంత దారుణంగా అతనిని హత్య చేయడానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.