ఈ నెల 20న కృష్ణ కాంత్‌ పార్క్‌కు తీసుకెళ్లి ఆమె పట్ల...

ఈ మద్య ఎక్కడ చూసిన అమ్మాయిలపై లైంగిక దాడులు ఆగడం లేదు . తాజాగా గ్రేటర్ నగరంలోని అమీర్పేటలో ప్రేమ పేరుతో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఆర్‌నగర్‌ ఇన్స్‌పెక్టర్‌ వహీదుద్దీన్‌ కథనం మేరకు నెల్లూరు ప్రాంతానికి చెందిన యువతి ఉద్యోగం కోసం గత ఏడాది నగరానికి వచ్చి ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటోంది. ఆమెకు తన స్నేహితురాలి ద్వారా కూకట్‌పల్లిలో ఉంటున్న కృష్ణాజిల్లా నివాసి సుధీర్‌తో పరిచయం ఏర్పడింది. తనకు తెలిసిన సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు.

అనంతరం ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతను ఈ నెల 20న కృష్ణ కాంత్‌ పార్క్‌కు తీసుకెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.