Asianet News TeluguAsianet News Telugu

కొంపముంచిన రాంగ్ నెంబర్: వివాహితపై లైంగిక దాడి, బ్లాక్‌మెయిల్

రాంగ్ నెంబర్ తో వివాహితకు వల

man arrested for sexual harassment in Hyderabad


హైదరాబాద్: రాంగ్‌ ఫోన్ నెంబర్ ఓ వివాహిత జీవితాన్ని సర్వనాశనం చేసింది. వివాహితను నమ్మించిన ఓ వ్యక్తి ఆమెతో చాటింగ్ చేసి చివరకు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆమె నుండి డబ్బులు వసూల్ చేశాడు.  బాధితురాలిపై నిందితుడి వేధింపులు తీవ్రం కావడంతో ఆమె పోలీసులను  ఆశ్రయించింది. 

హైద్రాబాద్‌ మీర్ పేటకు చెందిన ఓ మహిళ ప్రభుత్వ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె చురుగ్గా ఉండేది. ఒకరోజున ఆమెకు తెలియని నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. అయితే అపరిచిత వ్యక్తి పొరపాటున ఫోన్ చేశానని గుర్తించి వెంటనే  ఫోన్ కట్ చేశాడు. వెంటనే ఫోన్ చేసి పొరపాటున వేరే నెంబర్ కు ఫోన్ చేయబోయి మీ నెంబర్ కు ఫోన్ చేశానని  వివాహితకు క్షమాపణలు చెప్పాడు.


ఆ మరునాటి నుండి ప్రతి రోజూ ఏదో ఒక మేసేజ్ ను ఆమెకు వాట్సాప్ లో పంపేవాడు. గుడ్ మార్నింగ్ తో ప్రారంభించాడు. ఆమె ఆ మేసేజ్ కు రిప్లై ఇచ్చేది. ఈ రకంగా ఆమెతో చాటింగ్
చేసేవాడు.సోషల్ మీడియాలో చాటింగ్ ద్వారా వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది.

ఆ మహిళ వ్యక్తిగత విషయాలను కూడ అతను సేకరించాడు. ఆ మహిళ భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్ళాడు. తన కోర్కెను తీర్చాలని కోరాడు. తనతో చాటింగ్ చేసిన
విషయాన్ని, ఫోన్ లో మాట్లాడిన సమాచారాన్ని ఆమె భర్తకు చేరవేస్తానని బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. దీంతో ఆమె అతడికి లొంగిపోయింది. ఈ చాటింగ్ ఆధారంగా పలు మార్లు ఆమెపై ఆ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.


తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ మహిళ  నుండి రూ. 50 వేల నగదు, బంగారు ఆభరణాలను తీసుకొన్నాడు. ఇంకా డబ్బుల కోసం వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో
బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios