పెళ్ళి రోజునే భర్తకు ట్విస్టిచ్చిన భార్య, ప్రియుడికి, భార్యకు షాకిచ్చిన భర్త

Man arrested for cheating job aspirants in Hyderabad
Highlights

పెళ్ళైన రోజునే భర్తకు షాకిచ్చిన భార్య

హైదరాబాద్:ప్రియుడిని పెళ్ళి చేసుకొనేందుకు పెళ్ళి చేసుకొన్న భర్తను మోసం చేసింది ఓ వివాహిత. ప్రియుడితో కలిసి భర్త పరువు తీసే ప్లాన్‌లో భాగమైంది. అయితే తనకు ఏమీ తెలియనట్టుగానే భర్తను నిలదీసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భార్యే తన పరువు తీసేందుకు యత్నించిందని తెలుసుకొన్న భర్త షాకయ్యాడు.  బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.

అనంతపురం జిల్లా గుంతకల్లులోని తిలక్‌నగర్‌కు చెందిన షేక్ సయ్యద్ వలీ అలియాస్ రామ్ అదైత్వరెడ్డి 2006లో డిగ్రీ పూర్తి చేశాడు. రెండేళ్ళ పాటు ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత అక్కడ ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత గుంతకల్లు, తిరుపతి, కర్నూల్‌లలో పలు ఫార్మా కంపెనీల్లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశాడు.  అయితే  అప్పటికే అతడిపై చీటింగ్ కేసు నమోదైంది.  అయితే  ఆ తర్వాత కూడ అవే పనులు చేయడాన్ని మానుకోలేదు.2017 మార్చిలో కర్నూల్‌ 4వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత జైలు నుండి బయటకు వచ్చాడు.

జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత హైద్రాబాద్‌లోని ఎల్బీనగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు. జాబ్ కన్సల్టెన్సీలతో ఒప్పందం కుదుర్చుకొన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉద్యోగులకు వల వేశాడు. ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా ప్రచారం చేశారు. పలువురికి ఉద్యోగాలిప్పిస్తామని మోసాలు చేశాడు. ఈ సమయంలోనే షర్మిల అనే యువతితో అతడికి పరిచయమైంది.

 కొద్దిరోజుల్లోనే వారు స్నేహితులుగా మారిపోయారు. ఆమె షేక్‌సయ్యద్‌వలీతో  షర్మిల ప్రేమలో పడింది. అతడినిపెళ్లి చేసుకోవాలని భావించింది. అయితే మతాలు వేరు కావడంతో  పెళ్ళికి ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోరని భావించింది. దీంతో  అతడిని  రామ్‌ అద్వైతగా తల్లిదండ్రులకు పరిచయం చేసింది. వారు పెళ్లికి అంగీకరించలేదు.

షర్మిల తల్లిదండ్రులు కళ్యాణ్‌ అనే యువడితో ఆమెకు సంబంధం కుదిర్చారు.ఈ విషయం తెలిసిన సయ్యద్ వలీ  పథకం ప్రకారంగా కళ్యాణ్‌ను అతడి కుటుంబసభ్యులను  బెదిరించారు. దీంతో  ఈ సంబంధం రద్దైంది. దరిమిలా షర్మిల తల్లిదండ్రులు సయ్యద్‌వలీపై ఎల్‌బీనగర్‌ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత ఓల్డ్ అల్వాల్‌కు చెందిన వైద్యుడు సంతోష్‌తో ఆమెకు సంబంధం కుదిర్చారు షర్మిల తల్లిదండ్రులు. కానీ, తల్లిదండ్రులకు ఈ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని షర్మిల తేల్చి చెప్పింది. కానీ, బలవంతంగా ఆమెను సంతోష్‌కు ఇచ్చి పెళ్ళి చేశారు షర్మిల తల్లిదండ్రులు. ఈ విషయాన్ని షర్మిల తన లవర్‌ సయ్యద్ వలీకి చెప్పింది.

ప్రియుడు సయ్యద్ వలీతో కలిసి పథకాన్ని రచించింది.సయ్యద్ వలీ కూడ  షర్మిల కుటుంబసభ్యులకు తాను మారిపోయినట్టుగా నమ్మించాడు. గత ఏడాది నవంబర్  25న, షర్మిల, సంతోష్ వివాహం జరిగింది. అదే రోజున లోకాంటో డాట్ కామ్‌లో సంతోష్, ఫోటోలు, ఫోన్ నెంబర్  , వివరాలతో సంతురాక్ట్ అనే ఐడీతో  పురుష వ్యభిచారి (మేల్ ఎస్కార్ట్) గా ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. 

ఈ విషయమై సంతోష్‌ను భార్య షర్మిల నిలదీసింది. ఈ విషయంలో తనకు ఏ సంబంధం లేదని సంతోష్ చెప్పినా ఆమె వినలేదు. అయితే పథకం ప్రకారంగా  తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని భావించిన సంతోష్  సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు విచారణ నిర్వహించారు. ఈ విచారణలో  సయ్యద్ వలీతో పాటు  అతడి ప్రియురాలు  షర్మిల విషయం వెలుగు చూసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. 

loader