వైఎస్ఆర్ మరణంపై నారాయణ స్వామి వ్యాఖ్యలు: హైద్రాబాద్ పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు


వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణంపై  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీపై  ఆరోపణలు చేసిన  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Mallu Ravi complaints to Begum bazar police against Andhra Pradesh Deputy Chief Minister Narayana Swamy lns


హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు  ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణం విషయంలో  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం  నారాయణ స్వామి  ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలపై  కాంగ్రెస్ నేతలు  ఫిర్యాదు చేశారు. 

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  మరణానికి కాంగ్రెస్ నేతలు కారణమని ఆరోపించారు.కాంగ్రెస్ నేత సోనియా గాంధీపై  ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై  చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి  బేగంబజార్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణంపై  అనుమానాలున్నాయని నారాయణ స్వామి  చెప్పారు. 

also read:కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనం: రాజ్యసభకు వై.ఎస్. షర్మిల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల  ఈ నెల  4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరారు.  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్ఆర్‌సీపీ) నేతలు  కాంగ్రెస్ పై  విమర్శలు ప్రారంభించారు.  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణంపై  తమకు అనుమానాలు ఉన్నాయని  వైఎస్ఆర్‌సీపీ  నేతలు వ్యాఖ్యానించారు.  ఈ క్రమంలోనే  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం  నారాయణ స్వామి కూడ  ఇదే  వ్యాఖ్యలు చేశారు. 

also read:ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...

వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో  వైఎస్ఆర్‌సీపీ నేతలు  భయపడుతున్నారని  కాంగ్రెస్ నేతలు కూడ  ఎదురు దాడికి దిగారు. ఇదే సమయంలో  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలపై  తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

also read:పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి  ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి.  పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ కనీసం  15 శాతం ఓట్లు సాధించాలనే లక్ష్యంతో  వెళ్తుంది.  2014లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో  కాంగ్రెస్ పార్టీ  ఏపీలో ఉనికిని కోల్పోయింది.  రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడ  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios