Asianet News TeluguAsianet News Telugu

రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ నేతల కౌంటర్.. రేవంత్‌పై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకోమన్న మల్లు రవి..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పలువురు కాంగ్రెస్ నేతలు ఖండించారు. రేవంత్‌పై మాట్లాడే నైతిక అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. 

mallu Ravi and Addanki dayakar comments on Komatireddy rajagopal reddy issue
Author
First Published Aug 3, 2022, 4:04 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పలువురు కాంగ్రెస్ నేతలు ఖండించారు. రేవంత్‌పై మాట్లాడే నైతిక అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రేవంత్‌పై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకోమని చెప్పారు. కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి వెన్ను పొడిచారని మండిపడ్డారు. మూడేళ్లుగా బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఆదేశిస్తే నిన్న రాజీనామా ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్‌లో అనుభవించిన పదవులు సరిపోక.. కొత్త పదవుల కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్తున్నారని విమర్శించారు.

మరో నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్‌లకు కాంగ్రెస్‌ నేతలే దిక్కయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీలకు రేవంత్ రెడ్డి టార్గెట్ అన్నారు. ఇక, అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను ఎవరూ ఖతం చేయలేరని అన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను శవం అంటున్నారని.. మరి ఇన్ని రోజులు శవం దగ్గర ఎందుకు ఉన్నాడని ప్రశ్నించారు. పాత రికార్డులు తిప్పడం కాదు.. బట్టేబాజ్ మాటలు మానుకోవాలని సూచించారు. 

ఇక, మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి.. తాను కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. రేవంత్ పేరెత్తకుండా.. బయట నుంచి వ్యక్తి కింద పనిచేయాలా? అని ఈ సందర్బంగా రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామపై స్పందించిన రేవంత్ రెడ్డి.. సోనియాపై ప్రేమ ఉందని, కాంగ్రెస్‌పై గౌరవం వుందని కొందరు తేనేపూసిన కత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విసిరిన ఎంగిలి మెతుకులకు కొందరు ఆశపడ్డారని.. సోనియాను ఈడీ పిలిచిన రోజు దేశవ్యాప్తంగా ధర్నాలు జరుగుతుంటే, కొందరు మాత్రం అమిత్ షా దగ్గర కాంట్రాక్ట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని రేవంత్ ఆరోపించారు. సోనియాకు అవమానం జరిగితే.. మోడీ, అమిత్ షాలపై పోరాటం చేయాల్సిన సమయంలో కుక్క బిస్కెట్ల కోసం విశ్వాసఘాతుకులుగా మారారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: నేను రెడీ.. ఆరోపణలు నిరూపించకుంటే రాజకీయ సన్యాసం చేస్తావా?: రేవంత్‌ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి చాలెంజ్

ఇక, రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ కూడా ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని.. సీఎం అయి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే టీడీపీని ఖతం చేసి.. కాంగ్రెస్‌లో చేరి డబ్బులు పెట్టి పీసీసీ పదవి కొన్నాడని ఆరోపించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి స్పీకర్‌కు రాజీనామా ఇవ్వకుండా.. చంద్రబాబుకు రాజీనామా పత్రాన్ని ఇచ్చారని విమర్శించారు. ఉప ఎన్నికకు భయపడి రేవంత్ రెడ్డి.. ఉత్తుత్తి రాజీనామా చేసి డ్రామాలు చేశారని మండిపడ్డారు. 

సోనియా గాంధీని రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలి దేవత అన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఓ వీడియోను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. మూడు పార్టీలు మారిన వ్యక్తి రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ పార్టీ రేవంత్‌కు నాలుగోది అని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాడా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారనే విషయం అందరికి తెలుసని అన్నారు. ‘‘రేవంత్ రెడ్డి బ్రాండ్.. బ్లాక్ మెయిలర్’’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios