తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కలిశారు.

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కలిశారు. శనివారం అసెంబ్లీలో కేటీఆర్‌తో భేటీ అయిన భట్టివిక్రమార్క, వీహెచ్.. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం చేయాలని కోరారు. ఇక, పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార పార్టీల నేతలతో సమావేశం కావడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మరింది. గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో కలిసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గ అభివృద్ది పనుల కోసం సీఎం కేసీఆర్‌ను శాసనసభలో కలవగా.. చాంబర్‌లో కలవాల్సిందిగా చెప్పారని అన్నారు. సీఎం కేసీఆర్‌తో తన నియోజకవర్గ అభివృద్ది పనుల గురించి చర్చించానని తెలిపారు. తాను సీఎం కేసీఆర్‌ను దొంగచాటుగా కలవలేదని అన్నారు.