Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి కేబినెట్: భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి: మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం

తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి  గురువారంనాడు ప్రమాణం చేయనున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో పలువురు సీనియర్లకు  మంత్రులుగా చోటు దక్కనుంది. ప్రమాణం చేయనున్న మంత్రులకు  రేవంత్ రెడ్డితో పాటు పార్టీ నేతలు ఫోన్లు చేసి ఆహ్వానం పలికారు.

Mallu Bhatti Vikra Marka to Get deputy CM Post in Anumula Revanth Reddy Cabinet lns
Author
First Published Dec 7, 2023, 9:53 AM IST

హైదరాబాద్:  తెలంగాణ ముఖ్యమంత్రిగా  అనుముల రేవంత్ రెడ్డి గురువారంనాడు ప్రమాణం చేయనున్నారు.  రేవంత్ రెడ్డితో పాటు   11 మంది  గురువారంనాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో  తీసుకొనే వారికి  రేవంత్ రెడ్డితో పాటు  కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే  ఫోన్లు చేస్తున్నారు. తెలంగాణలో ఒకే ఒక్క డిప్యూటీ సీఎం పదవి ఉండే అవకాశం ఉంది. మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి దక్కనుంది.

రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటు దక్కనున్న నేతలు

1.మల్లు భట్టి విక్రమార్క, 
2.ఉత్తమ్ కుమార్ రెడ్డి
3.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
4.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,
5.దామోదర రాజనర్సింహ
6.దుద్దిళ్ల శ్రీధర్ బాబు
7..కొండా సురేఖ
8.సీతక్క
9.పొన్నం ప్రభాకర్
10..తుమ్మల నాగేశ్వరరావు
11.జూపల్లి కృష్ణారావు

మంత్రులుగా ప్రమాణం చేయనున్న జాబితా రాజ్ భవన్ కు చేరింది.  రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కినవారికి  రేవంత్ రెడ్డితో పాటు  మాణిక్ రావ్ ఠాక్రే  ఫోన్లు చేశారు.  మంత్రులుగా ప్రమాణం చేసేందుకు రావాలని ఆహ్వానించారు.  రేవంత్ రెడ్డి తొలుత మల్లు భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ కు ఫోన్ చేశారు. ఆ తర్వాత అందరూ నేతలకు  ఫోన్ చేసి  మంత్రులుగా  ప్రమాణ స్వీకారానికి రావాలని  రేవంత్ రెడ్డి  కోరారు.

ఈ నెల  5, 6 తేదీల్లో  మంత్రివర్గంలో ఎవరెవరికి  చోటు దక్కాలనే విషయమై  రేవంత్ రెడ్డి తో పాటు  కాంగ్రెస్ అగ్రనేతలు సుదీర్ఘ చర్చలు జరిపారు. తొలుత ముగ్గురు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించాలని  ప్రతిపాదన కూడ వచ్చింది. అయితే  ఈ విషయమై  మల్లు భట్టి విక్రమార్క మాత్రం ఒకే డిప్యూటీ సీఎం  పదవిని  ఉండాలని పట్టుబట్టారు.ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం కూడ సానుకూలంగా స్పందించింది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో  మల్లు భట్టి విక్రమార్క  ఉప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios