కుటుంబ పాలనపై కేటిఆర్ కు కాంగ్రెస్ బట్టి విక్రమార్క క్లాస్

First Published 31, Mar 2018, 5:23 PM IST
mallu batti vikramarka fire on ktr
Highlights
కేటిఆర్ కు వచ్చిన లేకి మాటలు మాకు రావు

తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు బట్టి విక్రమార్క క్లాస్ ఇచ్చారు. కాంగ్రెస్ కుటుంబ పాలనకు, టిఆర్ఎస్ కుటుంబ పాలనకు మధ్య తేడా ఏంటో వివరించారు. మల్లు బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు చదవండి.

నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలతో కేటిఆర్ కు పొలికా...? వాళ్ళెక్కడా నువ్వెక్కడా? థర్డ్ గ్రేడ్ పార్టే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది, తెలంగాణ ఇచ్చింది. కేటిఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నెహ్రు క్యాబినెట్ లో ఇందిరా లేరు... నెహ్రూ 16 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. ఇందిరా క్యాబినెట్ లో రాజీవ్ లేరు. రాజీవ్ క్యాబినెట్ లో ఇతర కుటుంబ సభ్యులు లేరు. ప్రధాని అవకాశం వచ్చినా మన్మోహన్ ను ప్రధాని చేసిన ఘనత సోనియాది. మన్మోహన్ క్యాబినెట్ లోను రాహుల్ కు అవకాశం ఉన్నా చేరలేదు. 10 ఏళ్ళు అవకాశం ఉన్నా ప్రధాని కాలేదు. కేటీఆర్ కు కాంగ్రెస్ తో పోల్చుకునే అర్హత లేదు. కేసీఆర్ పాలనలో కుటుంబ సభ్యులతో నిండిపోయింది. కాంగ్రెస్ పార్టీ థర్డ్ గ్రేడ్ పార్టీ అంటూ కేటీఆర్ మాట్లాడటం సరికాదు. కాంగ్రెస్ త్యాగాలు... పంచవర్ష ప్రణాళికలు కేటిఆర్ కు అర్థం కావు.  కేటీఆర్ కు చరిత్ర తెలియక లేకి మాటలు మట్లాడుతున్నడు.

తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లపై శ్వేత పత్రం విడుదల చేయండి. ఈ ప్రభుత్వం ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయలేదు. హడ్కో నుంచి తెచ్చిన అప్పును ఆదాయంగా చూపారు. ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ లోతుల్లోకి వెళ్లి నిలదీస్తుందనే భయంతోనే సస్పెన్షన్ వేటు వేశారు.

బడ్జెట్ ప్రవేశ పెట్టక ముందే సభ్యులపై వేటు వేసిన చరిత్ర టీఆరెస్ దే. ప్రమాదకరమైన ఆనవాయితీ కి తెరలేపారు. ప్రజాస్వామ్య వాదులంతా చర్చించాలి. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ చెప్పింది...దాన్ని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. అప్పుల సొమ్మును కూడా రెవెన్యూ సర్ ప్లస్ గా చూపించారు.

ఇప్పుడు పవర్ నిమిషాల్లో కొనుక్కోవచ్చు అలా చేయకుండా ఐదు నుంచి ఆరువేల కోట్లు పవర్ ను అవసరానికి మించి కొంటున్నట్లు తెలుస్తున్నది. పవర్ కొనుగోలుపై స్వేతపత్రం విడుదల చేయాలి. ప్రతిపక్షంలేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిన సర్కార్ గా టిఆర్ఎస్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం.

loader