హైదరాబాద్: తన అక్క లక్ష్మీ రెడ్డి బాధ చూడలేకనే కవలల పిల్లలను హత్య చేసినట్లు వారి మేనమామ మల్లికార్జున్ రెడ్డి చెప్పాడు. కవలల హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.  మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి సృజనారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి అనే 12 ఏళ్ల పిల్లలను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. 

పిల్లల హత్యతో తన అక్కాబావలకు ఏ విధమైన సంబంధం లేదని అతను పోలీసు విచారమలో చెప్పాడు. తన భార్య తనకు దూరం కావడంతో పిల్లల బాధ్యత తానే తీసుకున్నట్లు అతను తెలిపాడు. తన అక్క డిప్రెషన్ లో ఉన్నట్లు అతను తెలిపారుడు

హత్యతో కవల పిల్లల తల్లిదండ్రులు లక్ష్మీరెడ్డి, శ్రీనివాస రెడ్డిలకు సంబంధం లేదని పోలీసులు కూడా అంటున్నారు.  మల్లికార్జున్ రెడ్డిని, అతని డ్రైవర్ వివేక్ రెడ్డిని, మిత్రుడు వెంకట్ రెడ్డిని హైదరాబాదులోని చైతన్యపురి పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు.