Asianet News TeluguAsianet News Telugu

కోడలు గురించి గొప్పగా చెప్పే క్రమంలో మల్లారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు.. ఆ తర్వాత క్షమాపణ..

తెలంగాణ  కార్మిక  శాఖ మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కోడలు గురించి గొప్పగా చెప్పే క్రమంలో మల్లారెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

Malla reddy Apology After His controversial comments
Author
First Published Dec 5, 2022, 5:21 PM IST

తెలంగాణ  కార్మిక  శాఖ మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కోడలు గురించి గొప్పగా చెప్పే క్రమంలో మల్లారెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన ఓ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. తనదంతా ఓపెన్ హార్ట్ అని.. తాను ఏది దాచుకోనని అన్నారు. భూమి అమ్మి తన కొడుకును ఎంబీబీఎస్ చేయించానని చెప్పారు. తన కొడుకును డాక్టర్ చేస్తే.. తనకు డాక్టర్ కోడలు గిఫ్ట్‌గా వచ్చిందన్నారు. తమ రెడ్డిల అమ్మాయి ఐతే.. వాళ్లు రోజు కిట్టి పార్టీలు, ఫంక్షన్‌లు, పిక్నిక్‌లు అంటారని అన్నారు. తన కోడలు ఇప్పుడు హాస్పిటల్ మొత్తం ఆమెనే నడిపిస్తదని.. మెడికల్ కాలేజ్‌ కూడా చూసుకుంటదని అన్నారు. తనకు ఆమె మూడో కొడుకు లెక్క అని అన్నారు. 

అయితే ఈ కామెంట్స్‌పై మల్లారెడ్డి క్షమాపణలు చెప్పారు. తల్లిదండ్రులు లేని అమ్మాయిని కోడలుగా చేసుకున్నా.. ఒక డాక్టర్‌ను చదివిపిస్తే.. ఇంకో డాక్టర్‌ వచ్చిందని చెప్పానని అన్నారు. అలా అని తాను ఫ్లోలో చెప్పానని.. అలా చెప్పిన మాటకు వేరే అర్థం వస్తే కనక క్షమించాలని కోరారు.  

అదే కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. పిల్లలు అణిముత్యాలు అని.. వాళ్లను పాడు చేసేది తల్లిదండ్రులేనని అన్నారు. అబ్బయిలు, అమ్మాయిలు.. ప్రేమ, దోమ, ప్రెండ్షిప్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ఎంబీబీఎస్ అంటేనే చదువు అని.. అది ఉంటేనే లైఫ్‌లో సక్సెస్ అవుతారని చెప్పారు. తన  విద్యాసంస్థల్లో జరిగిన ఓ కార్యక్రమంలో మల్లారెడ్డి  పాల్గొన్నారు.

మెడికల్‌ కాలేజీల్లో డొనేషన్లు లేవు.. అంతా ఆన్‌లైన్‌ అడ్మిషన్లేనని చెప్పారు. తన కొడుకుకు సీటు కావాలన్నా తాను ఇవ్వలేనని తెలిపారు. తనపై ఐటీ రైడ్స్‌ చేశారని.. తాను భయపడలేదని అన్నారు.  400 మంది వచ్చారని.. వాళ్లపని వాళ్లు చేసుకున్నారని చెప్పారు. తాను క్యాసినో నడిపించడం లేదని.. కాలేజీలు నడిపిస్తున్నానని అన్నారు. తుఫాన్‌లు వచ్చినా తట్టుకునే ధైర్యం వచ్చిందని తెలిపారు. విద్యార్థులు తనను రోల్ మోడల్‌గా తీసుకోవాలని.. కష్టపడితే ఎవరైనా సక్సెస్ అవుతారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios