Asianet News TeluguAsianet News Telugu

మల్కాజ్‌గిరిలో గెలుపుపై వ్యాఖ్యలు: కేటీఆర్‌కు రేవంత్ ఘాటు లేఖ

సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందడంతో రేవంత్ రెడ్డి మళ్లీ స్పీడ్ పెంచారు. టీఆర్ఎస్‌పై సూటిగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. 

malkajgiri mp Revanth Reddy open letter to KTR
Author
Hyderabad, First Published May 29, 2019, 8:48 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందడంతో రేవంత్ రెడ్డి మళ్లీ స్పీడ్ పెంచారు. టీఆర్ఎస్‌పై సూటిగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్‌కు తిరస్కరణ మొదలైందని.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమన్నారు.  మల్కాజ్‌గిరిలో ప్రశ్నించే గొంతుకకు ప్రజలు పట్టం కట్టారని.. సిద్ధిపేట, సిరిసిల్లలో మెజార్టీలు తగ్గడం టీఆర్ఎస్ పనితనానికి సంకేతమని రేవంత్ ఎద్దేవా చేశారు.

కరీంనగర్, నిజామాబాద్‌లలో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఓడిపోయారని.. కేసీఆర్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందనడానికి ఇదే సంకేతమన్నారు.

ఏ రాజకీయ పార్టీకైనా వర్తమానంలో ప్రజల ఆదరణ ఎలా ఉందన్నదే ప్రామాణికమన్న రేవంత్.. ఐదు నెలల కిందటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కాదని.. ఐదేళ్ల కిందటి ఫలితాలతో పోల్చుకోవడం అతి తెలివికి నిదర్శనమని కేటీఆర్‌పై సెటైర్లు వేశారు.

గత డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు నెలల వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు సుమారు 20 లక్షల ఓట్లు తగ్గిపోయాయని పేర్కొన్నారు. మల్కాజ్‌గిరిలో తన గెలుపుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయని రేవంత్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios