తెలంగాణ సచివాలయం కూల్చివేతపై మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తోందని రేవంత్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టే అవకాశముంది. కాగా.. నూతన సచివాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు.

ప్రస్తుతమున్న సచివాలయంలోని డి-బ్లాక్ వెనుక భాగంలోని తోటలో సుమారు రూ.400 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.