హైదరాబాద్ లోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో డిపో లోపల 11 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని hyderabadలోని బోయిగుడాలో భారీ fire accident చోటు చేసుకుంది. బోయిగుడాలోని Timber Depotలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో టింబర్ డిపోలో 12 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. టింబర్ డిపోలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. స్క్రాప్ గోడౌన్ కు మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత ప్లాస్టిక్ గోడౌన్ కు కూడా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. 11 మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. 

ఎనిమిది ఫైరింజన్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయటపడినట్లు తెలుస్తోంది. ఊపిరి తీసుకోవడానికి అతను ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. జనావాసాల మధ్య ఈ టింబర్ డిపో ఉంది. చుట్టుపక్కల ఇళ్లవాళ్లను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఒక్కరిని సహాయక బృందాలు వెలికితీశాయి. బీహార్ నుంచి వచ్చిన కార్మికులు ఈ ప్లాస్టిక్ గోడౌన్ లో పనిచేస్తున్నారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించాయి. గోడౌన్ చుట్టుపక్కల నివాస గృహాలు ఉన్నాయి. గోడౌన్ కు ఎటువంటి అనుమతులు కూడా లేవని తెలుస్తోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వీడియో

కార్మికులు రాత్రిపూట అందులో పడుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ కు సంబంధించిన గోడౌన్ అది. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రేకుల కప్పు గల గోడౌన్ మొత్తం దగ్ధమైంది. నిద్రలోనే కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రాజేష్, బిట్టు, సికిందర్, దామోదర్, సత్యేందర్, దినేష్, రాజు, దీపక్, పంకజ్, దినేష్, చింటులుగా గుర్తించారు.

మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఓ వ్యక్తి గోడ దూకి సురక్షితంగా బయపడినట్లు పోలీసు అధికారి చెప్పారు. వాచ్ మన్ ఉన్నాడా, లేడా అనేది చూస్తున్నట్లు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఎటు వెళ్లాలో తెలియక చీకట్లో కార్మికులు మృత్యువాత పడ్డారని అన్నారు. మంటల ధాటికి పైకప్పు కూలి పడింది.

బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందిన వెంటనే అధికార వర్గాలు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, అయినప్పటికీ కార్మికులను కాపాడలేకపోయారని అన్నారు. షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చునని అధికారులు చెప్పారని ఆయన అన్నారు. విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో గోడౌన్లు ఉన్నాయని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రమాదానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. హైదరాబాదు పరిధిలో ఉన్న స్క్రాప్ గోడౌన్లను తనిఖీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.